NBA INSPECTION AT SRI PADMAVATHI WOMEN’S POLYTECHNIC COLLEGE _ శ్రీపద్మావతీ మహిళా పాలిటెక్ని క్కళాశాల లో ఎన్.బి.ఏ ఇన్పెక్షన్  

Tirupati, 27 June 2025:  An inspection was conducted on Friday by representatives of the National Board of Accreditation at the TTD- run Sri Padmavathi Women’s Polytechnic College.

As a part of the NBA renewal process, an expert team from New Delhi visited the college and reviewed the laboratory, faculty, staff details, records, and other infrastructure facilities. 

The team also gathered feedback from students regarding teaching quality, lab facilities,  library, and other academic aspects.

Previously, the college had received NBA accreditation for a period of three years. As the validity is nearing expiration, this inspection was carried out by the NBA officials.

Dr. M. Padmavathamma, the Principal of the college, expressed her gratitude to the TTD management, TTD Education Department officials, and the college team for their cooperation during the inspection.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్.బి. ఇన్ స్పెక్షన్  

తిరుపతి, 2025, జూన్ 27: తిరుమల తిరుపతి దేవస్థానములు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం నేషనల్ బోర్డు అక్రిడిటేషన్ (ఎన్.బి.ఏ) ప్రతినిధులు పరిశీలన  నిర్వహించారు. కళాశాలలో ఎన్.బి.ఏ పునరుద్దరణకు న్యూఢిల్లీ నుండి  ఎన్.బి.ఏ నిపుణుల బృందం కళాశాలలో ప్రయోగశాలలు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది వివరాలు, రికార్డులు, తదితర మౌళిక సదుపాయాలను పరిశీలించారు. కళాశాలలో బోధన, ల్యాబ్స్, లైబ్రరీ, బోధన తదితర అంశాలపై విద్యార్థుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించారు. గతంలో శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు మూడేళ్ల పాటు ఎన్.బి.ఏ అనుమతి లభించింది. గడవు ముగియనుండడంతో ఎన్.బి.ఏ ప్రతినిధులు పాలిటెక్నిక్ కళాశాలలో ఇన్స్పెక్షన్ నిర్వహించారు.

ఈ ఎన్.బి.ఏ ఇన్స్పెక్షన్  కు సహకరించిన టిటిడి మేనేజ్మెంట్ కు, టిటిడి విద్యాశాఖాధికారికి, కళాశాల బృందానికి ప్రిన్సిపాల్ డా. ఎం. పద్మావతమ్మ ధన్యవాదాలు తెలియజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.