TTD DENIES MISINFORMATION ON SRIVANI DARSHAN TICKETS _ శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లపై దుష్ప్ర‌చారం స‌రికాదుః టీటీడీ

Tirumala, 12 May 2025: In a statement on Monday evening, TTD has stated that the propaganda being spread by some on social media that Srivani Darshan tickets being issued offline in Tirumala are left over is completely false. 

In fact, 500 tickets are available online and 200 tickets are available at Tirupati Airport, and devotees are booking them from time to time.

There is no such thing as Srivani Darshan tickets remaining online on any given day. For the convenience of devotees, 800 tickets are being issued offline to devotees every day in Tirumala.  

While the facts are like this, some people are spreading rumors on social media that hundreds of SRIVANI were leftover in the last few days which is far from the truth.

TTD appeals that it is not appropriate to spread false information and hurt the sentiments of devotees.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లపై దుష్ప్ర‌చారం స‌రికాదుః టీటీడీ

తిరుమల 2025, మే 12: తిరుమ‌ల‌లో ఆఫ్‌లైన్ లో ఇస్తున్న శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల మిగిలిపోయాయంటూ సోషియ‌ల్ మీడియాలో కొంద‌రు చేస్తున్న ప్ర‌చారం పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని టీటీడీ పేర్కొంది. వాస్త‌వానికి ఆన్ లైన్‌లో 500 టికెట్లు, తిరుప‌తి ఎయిర్ పోర్ట్ లో 200 టికెట్లను అందుబాటులో ఉంచ‌గా ఎప్ప‌టిక‌ప్పుడు భ‌క్తులు బుక్ చేసేసుకుంటున్నారు.

ఏరోజు కూడా ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు మిగిలిన సంద‌ర్భం లేదు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు 800 టికెట్లను భక్తులకు ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్నారు. గత కొన్ని రోజుల్లో ఆఫ్ లైన్ లో పదుల సంఖ్యలో తగ్గాయేకాని,
కొంద‌రు వ్య‌క్తులు సోషియ‌ల్ మీడియాలో గ‌త‌వారం రోజుల్లో వందల సంఖ్యలో టికెట్లు మిగిలిపోయిన‌ట్లు ప్ర‌చారం చేయడం పూర్తిగా అవాస్తవం. అవాస్త‌వ సమాచారాన్ని ప్ర‌చారం చేసి భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌డం త‌గ‌ద‌ని టీటీడీ విజ్ఞ‌ప్తి చేస్తోంది.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.