WHITE PAPER ON SRIVANI TRUST FUNDS-TTD CHAIRMAN _ శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం- దుష్ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు- ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం

– దుష్ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు

– టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయం

– ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమల, 2023 జూన్‌ 19: శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ అంశంపై రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి మీడియా ప్రతినిధులకు వివరించారు.

– సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించడం కోసం 2019లో టీటీడీ శ్రీవాణి ట్రస్టును ఏర్పాటుచేసింది.
వ ఈ నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాలతోపాటు తెలంగాణ, పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని గిరిజన, ఎస్పీ, మత్స్యకార గ్రామాల్లో మొత్తం 2,445 ఆలయాల నిర్మాణం జరుగుతోంది.

– ఈ ట్రస్టు నిధులతో పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు ఆర్థికసాయం అందిస్తున్నాం.

– టీటీడీలో పూర్తి పారదర్శక పాలన జరుగుతోంది. ఇందుకు సంబంధించి మా పాలకమండలి టీటీడీ ఆస్తులపై 2021 జూన్‌ 21వ తేదీన, బంగారు, నగదు డిపాజిట్లపై 2022 నవంబరు 5వ తేదీన శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది.

– రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 300 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

– నిరాదరణకు గురైన ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ప్రతినెలా ఆలయ కమిటీ బ్యాంకు అకౌంట్‌లో రూ.5 వేలు జమ చేయాలని మా పాలకమండలి నిర్ణయించింది.

– శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేకంగా బ్యాంకు అకౌంటు ఉంది. అందులోనే విరాళాలు జమ అవుతాయి. టీటీడీ నుండి ఒక రూపాయి కూడా పక్కదారి పట్టే ప్రసక్తే లేదు.

– శ్రీవాణితోపాటు ఇతర ఏ ట్రస్టుల్లో అయినా అవినీతి జరుగుతోందనే అనుమానం ఉంటే ఎవరైనా వివరాలు తెలుసుకోవచ్చు.

– ఈ విషయం పై 2023 జనవరి 23వ తేదీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి శ్రీవాణి ట్రస్ట్ నిధులు, ఈ నిధులతో నిర్మిస్తున్న, నిర్మించిన, నిర్మించబోయే ఆలయాల వివరాలు పూర్తిగా వివరించారు. అయినా కొందరు పదే పదే ఆరోపణలు చేయడం శోచనీయం.

– శ్రీవాణి టికెట్‌ తీసుకునే భక్తులకు ట్రస్టుకు విరాళం కింద రూ.10 వేలకు, దర్శనం టికెట్‌ కోసం రూ.500కు రెండు రసీదులు ఇస్తున్నాం. ఆన్‌లైన్‌లో ఈ టికెట్‌ బుక్‌ చేసుకున్నా రెండు రసీదులు వస్తాయి.

– రూ.500/-కు మాత్రమే రసీదు ఇచ్చి మిగిలిన రూ.10 వేలు దోచుకుంటున్నారని కొందరు వ్యక్తులు రాజకీయ, వ్యక్తిగత లబ్ధి కోసం ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

LEGAL ACTION AGAINST THOSE WHO INDULGE IN FALSE ALLEGATIONS

TIRUMALA, 19 JUNE 2023: TTD Trust Board under the Chairmanship of Sri YV Subba Reddy has decided to release white paper on the SRIVANI Trust funds. It has also resolved to take legal action against those vested interests who indulge in making false allegations on the use of the funds of the SRIVANI Trust for their political and personal mileage.

Talking to media persons at Annamaiah Bhavan in Tirumala on Monday, the TTD Chairman along with the TTD EO Sri Dharma Reddy said that as a part of the propagation of Hindu Sanatana Dharma TTD established SRIVANI Trust in 2019 with a noble intention to take up the construction of temples in SC, ST, BC and Fishermen colonies, restoration of ancient temples under the funds of Sri Venkateswara Alaya Nirmana(SRIVANI) Trust.

“Out of 2445 temples, 326 are already completed while the remaining are underway with the funds of SRIVANI Trust in both the Telugu states, Tamilnadu, Karnataka and Pondicherry. TTD has released white papers on its Properties and Gold Deposits on June 21 in 2021 and on November 5 in 2022 in a transparent manner. 

Brushing aside the allegations by some vested interests about misuse and diversion of SRIVANI funds, the Chairman asserted every single penny is utilized in a transparent manner towards the construction of temples. The EO has already clarified on the utilization of funds under SRIVANI Trust towards the construction of various temples to the media on January 23 this year. 

Elaborating further he said, Under SRIVANI, TTD provides darshan to 1000 devotees on a day which includes 500 online and the remaining will be issued at JEO Office in Tirumala. As soon as the devotee pays Rs.10,500(Rs.10,000 towards the Trust as donation and Rs.500 towards Darshan ticket) a receipt will be generated to them. TTD  has opened up a separate Account for SRIVANI. If anyone has any doubts regarding this, they can verify the account”, he challenged.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI