ELECTRIC BUS DONATED TO TTD _ టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం
Tirumala, 30 May 2026: Delhi-based Nayati Healthcare & Research Agra Private Limited donated an Olectra electric bus worth Rs.1.13 crore to TTD on Saturday.
On this occasion, the company’s Chairperson Smt Neera Radia performed special prayers for the bus in front of the Srivari Temple and handed over the vehicle documents and keys to TTD Chairman Sri B.R. Naidu and Additional EO Sri Ch. Venkaiah Chowdary.
Later, the Chairman and Additional EO travelled in the bus along with the donor and appreciated the initiative, stating that the vehicle offers a comfortable travel experience for the devotees.
Among those present were Srivari Temple Dy EO Sri Lokanatham, former TTD Board Member Sri D.P. Anantha, and Tirumala Transport DI Sri Krishnayya.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం
తిరుమల, 2026 మే 30: ఢిల్లీలోని నయాతి హెల్త్ కేర్& రీసెర్చ్ ఆగ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శనివారం ఉదయం టీటీడీకి రూ.1.13 కోట్లు విలువైన ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించారు.
ఈ మేరకు ఆ సంస్థ అధినేత శ్రీమతి నీరా రాడియా శ్రీవారి ఆలయం ముందు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సుకు సంబంధించిన పత్రాలు, తాళాలను టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్, అదనపు ఈవో దాతతో కలిసి బస్సులో ప్రయాణించి, ప్రయాణికులకు ఈ బస్సు చాలా సౌకర్యవంతంగా ఉందని దాతను అభినందించారు.
కాగా ఈ బస్సును తిరుమలలోని భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సు గా వినియోగించనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు శ్రీ డి.పి.అనంత, తిరుమల ట్రాన్స్ పోర్ట్ డీఐ కృష్ణయ్య పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.




