GOLDEN KATI AND VARADA HASTHAMS DONATED TO SRI VEKATESWARA _ శ్రీ‌వారికి బంగారు క‌ఠి, వ‌ర‌ద హ‌స్తాలు విరాళం

Tirumala, 16 May 2025: A magnificent golden offering was presented to Sri Venkateswara Swamy at Tirumala on Friday. 

Sri Sanjiv Goenka from Kolkata donated a golden Kati and Varada Hasthams, weighing around 5.267 kilograms and worth Rs.3.63 crore. 

These ornaments are embedded with precious diamonds and gem stones.

The ornaments were formally handed over to TTD Additional Executive Officer Shri Ch. Venkaiah Chowdary at the Ranganayakula Mandapam in Tirumala.

The temple Deputy EO Sri Lokanatham, Bokkasam In-charge Sri Gururaja Swamy, and other officials were also present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ‌వారికి బంగారు క‌ఠి, వ‌ర‌ద హ‌స్తాలు విరాళం

తిరుమ‌ల‌, 2025 మే 16: తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి శుక్ర‌వారం ఉద‌యం భారీ బంగారు కానుక విరాళంగా అందింది. కలక‌త్తాకు చెందిన శ్రీ సంజీవ్ గోయెంకా రూ.3.63కోట్లు విలువైన 5.267 కేజీల బంగారంతో వ‌జ్రాలు, ర‌త్నాల‌తో పొదిగిన‌ క‌ఠి, వ‌ర‌ద హ‌స్తాల‌ను చేయించి స్వామివారికి స‌మ‌ర్పించారు.

ఈ మేర‌కు తిరుమ‌ల‌లోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రికి ఆభ‌ర‌ణాల‌ను అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, బొక్క‌సం ఇన్ ఛార్జి శ్రీ గురురాజ స్వామి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డిన‌ది.