AP CS OFFERS PRAYERS _ శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్

TIRUMALA, 14 JULY 2024: The Honourable CS of AP Sri Neerabh Kumar Prasad has offered prayers in the temple of Sri Venkateswara Swamy in Tirumala along with his family on Sunday.

After darshan he was offered Vedaseervachanam by vedic pundits at Ranganayakula Mandapam followed by the presentation of a Laminated photo of Srivaru and Theertha Prasadams by JEO Sri Veerabrahmam.

District Collector Dr Venkateswar, Commissioner Smt Aditi Singh also were present.

Among other TTD officials, JEO for Health and Education Smt Goutami, DyEOs Sri Lokanatham, Sri Harindranath, VGO Sri Nandakishore and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్

తిరుమల, 2024 జూలై 14: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ దంప‌తులు ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అందించారు. అనంత‌రం శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు, డైరీ, క్యాలెండ‌ర్‌ను జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో  జేఈఓ శ్రీమతి గౌతమి, డెప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ హరీంధ్ర నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.