‘శ్రీవారిసేవ ‘ కు భక్తుల నుండి అనూహ్యస్పందన
‘శ్రీవారిసేవ ‘ కు భక్తుల నుండి అనూహ్యస్పందన
తిరుమల, 2010 జూన్ 14: తిరుమల శ్రీవారి దర్శనార్థమై విచ్చేసే వేలాది మంది భక్తులకు ఉచిత సేవలందించే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ‘శ్రీవారిసేవ’ పథకానికి భక్తుల నుండి అనూహ్యస్పందన వస్తున్నది.
ఈ వేసవిలో అనగా మే1వ తేది నుండి జూన్ 14 వరకు తిరుమలలో భక్తులకు దాదాపు 6 వేల మంది సేవకులు తమ సేవలను అందించారు. వీరిలో స్త్రీలు 3,837 కాగా పురుషులు2,278 మంది. మొత్తం బృందాలు 388. ఈ సేవకులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల నుండి తిరుమలకు విచ్చేసి భక్తులకు ప్రేమతో, సేవాభావంతో సేవలందించారు.
వీరు తిరుమలలోని అన్నదానం, వైకుంఠం -|, || కాంప్లెక్స్‌లు, శ్రీవారి ఆలయం, లడ్డుకౌంటర్లు వసతి సముదాయాలు, ఆలయంముందు, శ్రీవారి పుష్కరిణి, క్యూలైన్లు, కల్యాణకట్ట, ఉద్యానవన విభాగం, ఆరోగ్యశాఖ తదితర విభాగాల ద్వారా భక్తులకు సేవలందించడం జరిగింది. ఈ సేవకులలో ఎక్కువ శాతం ప్రభుత్వ,ప్రవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులు సేవలో పాల్గొనడం గమనార్హం.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.