FEBRUARY QUOTA RELEASED _ శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటా విడుదల
TIRUMALA, 21 NOVEMBER 2024: The February 2025 quota of Arjita Seva tickets were released on Thursday by TTD on Thursday online which included Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam, Sahasra Deepalankara Seva 2025.
Details of other darshan and accommodation
TTD will release the February quota for virtual services and their viewing slots online at 3 PM on Thursday November 21, while the Anga Pradakshinam tokens will be released at 10am, SRIVANI tickets at 11am, Physically challenged and senior citizens at 3pm on November 23.
The Rs.300 Special Entry Darshan will be released at 10am on November 25, accommodation for Tirumala and Tirupati at 3pm on the same day.
Devotees are requested again to book the Arjita Sevas, darshan and accommodation tickets through TTD website https://ttdevasthanams.ap.gov.in only.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటా విడుదల
తిరుమల, 2024 నవంబరు 21: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా 2025 ఫిబ్రవరి నెల కోటాను గురువారం టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.
మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
నవంబరు 23న అంగప్రదక్షిణం టోకెన్లు….
ఫిబ్రవరి నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను నవంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల ఆన్ లైన్ కోటాను నవంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నవంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
నవంబరు 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబరు 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల…
తిరుమల, తిరుపతిలలో ఫిబ్రవరి నెల గదుల కోటాను నవంబరు 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.