JYESTABHISHEKAM BEGINS AT SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

* FESTIVE SNAPANA TIRUMANJANAM

Tirumala, 2, June 2023: The three-day-long festivities of celestial Jyestabisekam  commenced at the  kalyana Mandapam in the Sampangi Prasadam of Srivari temple on Friday 

As part of the fete ritwicks performed shanti Homa,shata Kalash pratista avahana, Nava Kalash pratista avahana,kankakana pratista at yagashala ahead of kankana dharana.

Thereafter Snapana thirumanjanam was performed for utsava idols of Sri Malayappaswami and his consorts amidst chanting of stree Sutkam, Purusha sutkam, bhu sutkam, Neela sutkam and Narayan sutkam.

Later in the evening a diamond kavacham is adorned to utsava idols of swami and ammavaru and paraded in the Mada streets after sahasra deepalankara Seva.

Similarly, the utsava idols will be adorned with pearl kavacham on Saturday and gold kavacham on Sunday and bless the devotees.

TTD EO Sri AV Dharma Reddy couple, TTD board member Sri Maruti Prasad and temple Dyeo Sri Loganathan were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

శ్రీవారి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

– వేడుకగా స్నపనతిరుమంజనం

తిరుమల, 2023 జూన్ 02: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగ‌నున్న‌ జ్యేష్ఠాభిషేకం శుక్ర‌వారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం ఋత్వికులు యాగశాలలో శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు.

కాగా, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరిస్తారు. సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు వజ్రకవచంతో ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇదిలా ఉండగా శ‌నివారం ముత్య‌పుకవచంతో, ఆదివారం స్వర్ణకవచంతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి దంపతులు, బోర్డు మెంబర్ శ్రీ మారుతి ప్రసాద్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.