ANKURARPANAM FOR SRIVARI PUSHPA YAGAM HELD _ శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ
Tirumala, 29 October 2025: The Ankurarpanam fete for annual Pushpayagam was held at Vasanta Mandapam in Tirumala on Wednesday evening.
Earlier, Acharya Ritwik Varanam was held, traditionally assigning the duties to the Archakas who perform the rituals during Pushpayagam.
Meanwhile, on Thursday, in connection with the annual Pushpayagam, Snapana Tirumanjanam, the procession of flowers, followed by Pushpayagam in the Kalyanotsava Mandapam will take place from 1 pm to 5 pm where in the floral bath will be rendered to the Utsava deities with tonnes of varieties of flowers in a colourful manner.
TTD has cancelled Tiruppavada Seva, Kalyanotsavam, Unjal Seva and Arjita Brahmotsavam on October 30 following the rituals.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుమల, 2025 అక్టోబర్ 29: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం జరుగనున్న పుష్పయాగానికి బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
ఈ సందర్భంగా ఉదయం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల కేటాయింపునే ఋత్విక్‌వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు.
రాత్రి 7 గంటలకు శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుల వారిని ఆలయం నుండి వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 8 నుండి 9గంటల నడుమ ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. అంకురార్పణం కారణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
అక్టోబర్ 30న పుష్పయాగం
శ్రీవారి ఆలయంలో గురువారం పుష్పయాగం సందర్భంగా ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా ఆర్జితసేవలైన తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.





