IMPOSING SRIVARI POURNAMI GARUDA SEVA _ శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
Tirumala, 18 Mar. 22: TTD organised grand monthly pournami Garuda Vahana Seva at Srivari Temple on, Friday evening.
Finely dressed and bejewelled Sri Malayappa blessed devotees on Mada streets between 7.00-9.00 pm
GARUDA – REDEEMER OF ALL SINS
Puranic legends say this Srivari Darshan on his favourite vahana of Garuda on Pournami day relieved devotees of their sins and blessed them with boons.
Garuda occupied a pivotal place in 108 Vaishnava regions of the world and was highlighted the concept of servitude to Sri Venkateswara begot all boons.
TTD additional EO Sri AV Dharma Reddy, former EO Sri Anil Kumar Singhal, Srivari temple DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy Peshkar Sri Srihari and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల, 2022, మార్చి 18: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, పూర్వ ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, విజిఓ శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.