SRAVANA UPAKARMA HELD _ శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రావణ ఉపకర్మ
TIRUMALA, 12 AUGUST 2022: On the auspicious occasion of Sravana Pournami on Friday, Sravana Upakarma was held in Tirumala temple.
As part of it, Sri Krishna Swamy was brought to Sri Varaha Swamy temple in a procession and Abhishekam was performed. Later a new Yagnopaveetham was offered to the deity and Asthanam was performed. After the ritual, Sri Krishna was brought back to Tirumala temple.
Temple DyEO Sri Ramesh Babu and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రావణ ఉపకర్మ
తిరుమల, 2022 ఆగస్టు 12: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా జరిగింది.
ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ కృష్ణస్వామివారిని శ్రీ భూవరహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకించారు. అనంతరం స్వామివారికి నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించి, ఆస్థానం నిర్వహించారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, ఇతర ఆధికారులు, పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.