KOIL ALWAR TIRUMANJANAM HELD _ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala, 09 July 2024: The traditional temple cleansing ritual, Koil Alwar Tirumanjanam in connection with Anivara Asthanam on July 16 was observed in Tirumala on Tuesday.

Speaking about the significance of the ritual outside the temple after completion of Tirumanjanam, the EO Sri J Syamala Rao said, this fete is usually held four times in a year i.e., on the preceding Tuesday ahead of Ugadi, Vaikunta Ekadasi, annual Brahmotsavams and Anivara Asthanam, inside the hill temple.

As a part of the ritual, the entire temple premises including ceilings, walls, pillars were cleansed smearing Parimalam, a special mixture made of several aromatic ingredients.

Later the devotees were allowed for darshan of Sri Venkateswara Swamy.

JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, DyEO Sri Lokanatham, Peishkar Sri Srihari were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 2024, జూలై 09: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది.

ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ, సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు.

కాగా, స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.