KOIL ALWAR TIRUMANJANAM HELD IN TIRUMALA TEMPLE _ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala, 11 July  2023: In connection with Anivara Asthanam on July 17, the traditional Temple cleansing  fete Koil Alwar Tirumanjanam was observed with religious fervour in Tirumala temple on Tuesday.

 

Speaking on the occasion TTD Executive Officer Sri AV Dharma Reddy said this unique purification of sanctum sanctorum ritual is usually observed four times in a year before Telugu Ugadi, Anivara  Asthanam, annual Brahmotsavam and  Vaikuntha Ekadasi.

 

The entire temple premises was cleaned with an aromatic mixture called Parimalam.

 

TTD has cancelled Astadala Pada Padmaradhana owing to the ritual. 

 

TTD Trust Board members Sri Rambhupal Reddy, Sri Madhusudhan Yadav, Sri Maruti Prasad, Sri Ramulu, DLO Sri Veeraju, temple DyEO Sri Lokanatham, Archaka Sri Kiran Swamy and others were present.

 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌  ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 2023, జూలై 11: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది.

ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు. 

కాగా, స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ రాంభూపాల్ రెడ్డి, శ్రీ మూరంశెట్టి రాములు, శ్రీ మారుతి ప్రసాద్, శ్రీ మధుసూదన్ యాదవ్, డిఎల్వో శ్రీ వీర్రాజు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, అర్చకులు శ్రీ కిరణ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.