WITH SRIVARI BLESSINGS ALL DAMS FULL IN TIRUMALA- TTD CHAIRMAN _ శ్రీ‌వారి ఆశీస్సుల‌తో నిండిన జలాశయాలు

CREDITS SRI SRINIVASA DIVYANUGRAHA HOMAM FOR ABUNDANT RAINS

DRINKING WATER NEEDS OF TIRUMALA FULFILLED

Tirumala,05 December 2023: TTD Chairman Sri Bhumana Karunakara Reddy said the drinking water requirement of Tirumala for the entire year ahead has been met with abundant rains received in the last four days.

The Chairman along with TTD JEO Sri Veerabrahmam and other officials inspected the reservoirs in Tirumala which brimming with waters due to the incessant heavy rains caused by the Michuang cyclone effect.

Speaking to media later the Chairman said fear of water scarcity popped up for Tirumala fifteen days ago. To resolve the situation TTD had decided to draw water from the Kandaleru reservoir also.

He said however as a result of the Sri Srinivasa Divyanugraha Homa which began from November 23 at the Sapta Go Pradakshina Mandiram, the rains commenced and with the benign blessings of Sri Venkateswara Swamy in the last two days Tirumala had received 24 cms of rainfall.

He said TTD officials are reviewing the situation frequently and opened the gates of the Gogarbham, Papa Vinasanam and Akashaganga dams during wee hours on Tuesday.

CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswar Rao, SE-2 Sri Jagadeeshwar Reddy, EE (water works) Sri Srihari, EE5 Sri Surendranath Reddy, VGO Sri Nanda Kishore and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో నిండిన జలాశయాలు

– శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హవిశేష హోమంతో విస్తారంగా వ‌ర్షాలు

– తిరుమలకు ఏడాదికి సరిపడా తాగునీళ్లు

– టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి

తిరుమ‌ల‌, 2023 డిసెంబ‌రు 05: శ్రీ‌వారి అనుగ్ర‌హంతో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండాయ‌ని, దాదాపు ఏడాదికి సరిపడా తాగు నీళ్లు ఉన్న‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు. మైచాంగ్ తుఫాను కారణంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో నిండిన జలాశయాలను మంగ‌ళ‌వారం ఛైర్మ‌న్ అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్బంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ, 15 రోజుల క్రితం తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో నీటి కొర‌త ఎక్కువ‌గా ఉన్న‌ద‌ని, దీనిని అధిగ‌మించ‌డానికి కండ‌లేరు రిజ‌ర్వాయ‌ర్ నుండి నీటిని పంపింగ్ చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. న‌వంబ‌రు 23వ తేదీ శ్రీ‌వారి పాదాల చెంత అలిపిరిలోని స‌ప్త‌గోప్ర‌ద‌క్షిణ మందిరంలో శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం ప్రారంభించిన‌ట్లు తెలిపారు. ఆ రోజు నుండే స్వామివారి అనుగ్ర‌హంతో తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో ప్రారంభ‌మైన వ‌ర్షాలు, గ‌త రెండు రోజుల్లో 24 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంద‌న్నారు.

టీటీడీ అధికారులు ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించి డ్యాంల నుండి నీటిని విడుద‌ల చేస్తార‌న్నారు. ఇందులో భాగంగా ఇవాళ తెల్లవారుఝామున‌ గోగర్భం, పాప వినాశనం, ఆకాశ‌గంగ‌ డ్యామ్ గేట్లను అధికారులు తెరచి నీటిని బ‌య‌ట‌కు వ‌దిలిన‌ట్లు వివ‌రించారు.

ఛైర్మ‌న్ వెంట జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, సిఈ శ్రీ నాగేశ్వ‌రావు, ఎస్ఈ – 2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఈఈ -5 ఈఈ(వాట‌ర్ వ‌ర్స్క్‌) శ్రీ శ్రీ‌హ‌రి, విజివో శ్రీ నంద కిషోర్‌, ఇత‌ర అధికారులు ఉన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.