శ్రీవారి కల్యాణకట్టలో ఉచితంగా తలనీలాలు తీసేందుకు అభ్యర్థుల నుండి దరఖాస్తుల ఆహ్వానం
శ్రీవారి కల్యాణకట్టలో ఉచితంగా తలనీలాలు తీసేందుకు అభ్యర్థుల నుండి దరఖాస్తుల ఆహ్వానం
తిరుమల, 2012 సెప్టెంబరు 2: శ్రీవారి సేవ కార్యక్రమంలో భాగంగా తిరుమలలోని కల్యాణకట్టలో 2012 సెప్టెంబరు 18వ తేదీ నుండి 2013 జనవరి 20వ తేదీ వరకు ఉచితంగా భక్తులకు తలనీలాలు తీసేందుకు అర్హులైన చిత్తూరు జిల్లాకు చెందిన నాయిబ్రాహ్మణ కులానికి చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. అభ్యర్థులు ఈ కింద తెలియబరిచిన అర్హతలు కలిగి ఉండాలి.
1. 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
2. నాయిబ్రాహ్మణ కులానికి చెంది ఉండాలి.
3. కక్షురకర్మలో అనుభవం కలిగి ఉండాలి.
4. స్కూల్ సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్, నేటివిటి సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
5. అభ్యర్థులు తిరుమల, తిరుపతి, చిత్తూరు జిల్లాకు చెందినవారై ఉండాలి.
6. స్త్రీ, పురుష అభ్యర్థుల వయసుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు వర్తిస్తాయి.
కాగా ఎంపికైన అభ్యర్థులు తితిదే నిర్దేశించిన నియమ నిబంధనలు పాటిస్తానని 100/- రూపాయల బాండు పేపరుపై లిఖితపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించి నియమ నిబంధనలు వర్తిస్తాయి.
పూర్తి చేసిన బయోడేటా ఫారాలను ”ప్రజాసంబంధాల అధికారి, శ్రీవారి సేవ కార్యా లయం(సేవా సదన్), ఆర్‌టిసి బస్టాండు లోపల, తిరుమల” అనే చిరునామాకు సెప్టెంబరు 13వ తేదీలోపు అందజేయాల్సి ఉంటుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.