ANKURARPANAM OBSERVED IN TRADITIONAL PATTERN FOR SRIVARI NAVARATRI BRAMHOTSAVAM, SAYS TTD EO Dr KS JAWAHAR REDDY _ శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ : టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ : టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుమ‌ల‌, 2020 అక్టోబరు 15: తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 16 నుండి 24వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింద‌ని టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. శ్రీ‌వారి ఆల‌యంలో గురువారం రాత్రి అంకురార్ప‌ణ అనంత‌రం ఈవో మీడియాతో మాట్లాడారు. అంకురార్ప‌ణ సంద‌ర్భంగా సేనాధిప‌తి అయిన శ్రీ విష్వక్సేనులవారు బ్ర‌హ్మోత్స‌వాల‌ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌యవంత‌మై శ్రీ‌వారి కృపాక‌టాక్షాలతో  ప్ర‌పంచ మానవాళికి మేలు జ‌ర‌గాల‌ని ఆకాంక్షించారు.‌

తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జ‌రిగింది. సంపంగి ప్రాకారంలో వైఖాన‌స ఆగ‌మోక్తంగా అంకురార్ప‌ణ ఘ‌ట్టం నిర్వ‌హించిన అనంత‌రం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి సేనాధిప‌తి వారిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హించారు.

విశిష్టత..

వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. న‌వ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. ప్రధాన ఉత్సవానికి 7, 5, 3 రోజుల ముందు అంకురార్పణ నిర్వహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.

సూర్యాస్తమయం తరువాతే..

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని ‘సస్యకారక’ అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో 9 రకాల వివిధ ధాన్యాలను నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి.

అంకురార్పణ క్రమం..

విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించారు.

అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.

ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్ ‌కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ రామ‌కృష్ణ దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విజిఓ శ్రీ మ‌నోహ‌ర్‌, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala, 15 October 2020: TTD Executive Officer Dr KS Jawahar Reddy said onThursday evening that the Ankurarpanam was observed as per Agama traditions for the Srivari Navaratri Brahmotsavam beginning from October 16-24 .

Speaking to the media later the TTD EO said as per the traditions all the arrangements for Brahmotsavam are supervised by Srivari Senadhipati  Sri Viswaksena.

He said he was confident that the Brahmotsavam held in ekantham as per COVID-19 restrictions will beget Srivari blessings for the entire humanity and shower prosperity for all.

Ankurarpanam event heralding the beginning of the nine day Srivari Navaratri Brahmotsavam was held in traditional manner at Ranganayakula Mandapam on Thursday nightamidst mangala vadyam and chanting of Vedic mantras.

Thereafter between 7.00-8.00 pm the Senadhipati Viswaksena was seated in Asthanam at Ranganayakula Mandapam

SIGNIFICANCE

The Ankurarpanam Neha’s great significance in Vaikhanasa  Agama  tradition were  the sprouting of nine grains to indicate the successful conduction of the Brahmotsavam and blessings of Sri Venkateshwara. Legends say that the ritual is performed either 7,5, or 3 day of the festival.

It is an established practice to perform the Ankurarpanam after sun set as sprouting of grains is better under the moonlight.

On the day of Ankurarpanam, the seeds are dipped in water in new vessels and the entire region is decorated with cow dung.Later on all gods – Brahma, Garuda,Sesha, Vakratunda, soma, Shanta, Indra, and Jaya are invited to participate in the Brahmotsavam.

Later amidst Vedic chanting of Bhumatas water is poured on sprouts and punya havachanam is observed with the offering of new vastrams.

Thereafter Somaraja mantram, Varuna mantra and Vishnu Suktam are recited  amidst mangala vadhyam and  Veda mantras.

TTD EO, Dr KS Jawahar Reddy,Additional EO Sri AV Dharma Reddy,JEO Sri P Basant Kumar,CVSO Sri Gopinath Jatti,additional CVSO Sri Shivkumar Reddy ,Sri Venugopal Dikshitulu,chief priest of Srivari temple,DyEO of Srivari temple Sri Harindranath,VGO Sri Manohar,Peshkar Sri Jaganmohan Charyulu,and others were present .

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TIRUPATI