KALANEERAJANAM IN MUTYAPU PANDIRI VAHANAM _ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక‌ శోభ

TIRUMALA, 29 SEPTEMBER 2022: Different dance troupes hailing from various states presented their native art forms in an attractive manner in front of Mutyapu Pandiri Vahanam on Thursday evening.

Among the cultural teams which allured the pilgrims in galleries with their unique art forms included, the Dappu Dance of Karnataka, Koyyalattam of Puducherry, and Drums of Maharastra, were a few to mention.

Devotees thoroughly enjoyed the Muttangi Vahana Seva with the performance by various artists as an added attraction.

Similarly, the devotional and cultural programs in Asthana Mandapam and on Nada Neerajanam also attracted devotees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక‌ శోభ
 
తిరుమల, 2022 సెప్టెంబ‌రు 29 ; శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో గురువారం తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం, తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రం, అన్న‌మాచార్య క‌ళామందిరం, శ్రీ‌రామ‌చంద్ర పుష్క‌రిణి వద్ద ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య‌ కళాశాలకు చెందిన శ్రీ మునిరత్నం బృందం మంగళధ్వని కార్య‌క్ర‌మం జరిగింది. తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాల అధ్యాపకులు శ్రీమతి కృష్ణవేణి బృందం  విష్ణుసహస్రనామ పారాయ‌ణం, ఉదయం 11 నుండి 12.30 గంటల వరకు  ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాలకు చెందిన శ్రీ సురేష్ బాబు బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.
       
సాయంత్రం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు  శ్రీ రంగనాథన్ బృందం అన్న‌మ‌య్య విన్న‌పాలు సంగీత కార్య‌క్ర‌మం, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీమతి ముని లక్ష్మీ బృందం హరికథ పారాయణం చేశారు.
 
తిరుప‌తిలో
 
తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీమతి ఉమా ముద్దుబాల బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అన్న‌మాచార్య క‌ళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ శ‌బ‌రి గిరీష్‌ బృందం  ప‌లు భ‌క్తి సంకీర్త‌న‌లు చ‌క్క‌గా ఆల‌పించారు. అదేవిధంగా, రామ‌చంద్ర పుష్క‌రిణిలో సాయంత్రం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు విద్యార్థులచే వాద్య సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.