DARBHA MAT AND ROPE PROCESSION HELD _ శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు
Tirumala, 16 September 2023:The procession of holy Darbha mat and rope used for Dhwajarohanam ceremony during Srivari Salakatla Brahmotsavam were brought to the Srivari temple in a grand procession from the TTD forest department office on Saturday by Deputy CF Sri Srinivasulu and his staff.
Later, a mat and a rope made of Darbha(holy grass) were placed on the Sesha Vahanam in the Ranganayakula Mandapam at Srivari temple. These sacred materials will be used in flag hoisting ceremony on September 18.
DARBHA MAT AND ROPE PLAY CRUCIAL ROLE
Garuda flag hoisting is done to mark the beginning of Brahmotsavam and this event is known as Dhwajarohanam.
On this occasion, the Garuda flag is hoisted on the flagpole of the temple and the three crore deities are invited to take part in the Brahmotsavam grandeur. Ritviks wrap the darbha mat with Vedic mantras around the flagpole. A rope strung with darbha is wound up to the flagpole. TTD Forest Department sweats for 10 days and nights in advance to prepare these holy materials with utmost dedication. Of the two types of Darbhas namely Shiva darbha and Vishnu darbha, Vishnu darbha is used in Tirumala.
Vishnu Darbha is specially grown in Chelluru village of Erpedu mandal. It was brought to Tirumala and dried in low sun for a week, cleaned well and made into a mat and rope. The forest department staff prepared a darbha mat 22 feet long, seven and a half feet wide and a rope over 200 feet long.
Temple Deputy EO Sri Lokanadham, VGO Sri Balireddy and others participated in this program.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు
తిరుమల, 2023 సెప్టెంబరు 16: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టిటిడి అటవీ విభాగం కార్యాలయం నుండి శనివారం డిఎఫ్‌వో శ్రీ శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు.
అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 18వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు.
ధ్వజారోహణానికి దర్భ చాప, తాడు కీలకం
బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు.
ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టిటిడి అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేశారు. అటవీశాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో దర్భ చాప, 200 అడుగుల పొడవు తాడు సిద్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, విజివో శ్రీ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది.