TTD MULLS SPECIAL AID CENTRES FOR BTU _ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా 8 ప్రధమ చికిత్స కేంద్రాల ఏర్పాటు

Tirumala, 25 August 2024: TTD  medical wing is setting up 8 new first aid Centers around Tirumala to address emergencies for devotees’ benefit during the forthcoming annual Brahmotsavam scheduled from October 4-12.

TTD is already operating 6 permanent dispensaries at Tirumala and Tirupati for providing medical aid to devotees, employees and locals.

In addition to two at Narayangiri Garden and one each at Rambageecha Rest House, Matrusree Tarigonda Vengamamba Anna Prasadam Complex Silatoranam, Bata Gangamma Temple, Papavinasanam, 7th Mile will be set up for the convenience of devotees during annual Brahmotsavams.

On the direction of the TTD medical department, senior doctors, paramedics medicines and ambulances with advanced medical equipment are being rolled out.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా 8 ప్రధమ చికిత్స కేంద్రాల ఏర్పాటు

తిరుమల, 2024 ఆగష్టు 25: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో నూతనంగా 8 ప్రధమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పటికే తిరుమల, తిరుపతిలలో శాశ్వతంగా ఆరు డిస్పెన్సరీలు, ఆరు ప్రథమ చికిత్స కేంద్రాలలో భక్తులకు, ఉద్యోగులకు, స్థానికులకు టీటీడీ వైద్య సేవలు అందిస్తోంది.

బ్రహ్మోత్సవాలలో లక్షలాదిగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అదనంగా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో రెండు,
రాంబగీచ అతిథి గృహాలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రము, శిలా తోరణం, బాట గంగమ్మ ఆలయము, పాపానాశనం, 7వ మైలు వద్ద ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు.

ఇందుకోసం టిటిడి వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, మందులు, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్ లు సిద్ధం చేసుకుంటున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.