BRAHMOTAVAM BOOKLETS RELEASED _ శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహనసేవల బుక్‌లెట్ ఆవిష్కరణ
TIRUMALA, 06 SEPTEMBER 2024: TTD EO Sri J Syamala Rao along with the Additional EO Sri Ch Venkaiah Chowdary released the ensuing annual Srivari brahmotsavams 2024 at Annamaiah Bhavan in Tirumala on Friday.
The Salakatla Brahmotsavams this year are scheduled from October 4 to 12 with Ankurarpanam on October 3. The booklet includes all the utsavams, daily special rituals, vahana sevas etc.
Both the JEOs Smt Goutami, Sri Veerabrahmam, CVSO Sri Sreedhar, CE Sri Satyanarayana, Special Officer of Press and Publications Sri Rama Raju were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహనసేవల బుక్‌లెట్ ఆవిష్కరణ
తిరుమల, 2024 సెప్టెంబరు 06: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను టీటీడీ ఈవో శ్రీజె.శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో బ్రహ్మోత్సవాల సమస్త సమాచారంతో ఆకట్టుకునే రంగులతో, చిత్రాలతో బుక్‌లెట్‌ను ముద్రించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్, సిఈ శ్రీ సత్యనారాయణ, సిపిఆర్ఓ డాక్టర్ టి.రవి, ప్రెస్ మరియు పబ్లికేషన్స్ ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.