DARBHA MAT AND ROPE PROCESSION HELD _ శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు
Tirumala, 02 October 2024: The celestial procession the Darbha Mat and Rope used during Dhwajarohanam ceremony as a part of Srivari Salakatla Brahmotsavams was held on Wednesday.
The parade commenced from TTD forest department office led by its Deputy Director Sri Srinivasulu and his staff.
Later, the mat and rope made of darbha were placed on the Seshavahanam inside the Ranganayakula mandapam of the Srivari temple.
The hoisting of Garuda flag on the temple on the evening of October 4 marks the beginning of the nine-day Brahmotsavam.
For the preparation of this sacred mat and rope, every year the TTD forest staff collects Vishnu Darbha in Chelluru village of Erpedu mandal.
It was brought to Tirumala and dried in the low sun for a week, cleaned well and made into mats and ropes. The forest department staff prepared a darbha mat measuring 22 feet long and seven and a half feet wide and a rope 225 meters length.
Range Officer Sri. Ramana Reddy, M Sri. Srinivasulu, Sri. Ramakoti and others participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు
తిరుమల, 2024 అక్టోబరు 02: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టిటిడి అటవీ విభాగం కార్యాలయం నుండి బుధవారం డిఎఫ్‌వో శ్రీ శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు.
అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 4వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు.
ధ్వజారోహణానికి దర్భ చాప, తాడు కీలకం
బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు.
ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టిటిడి అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేశారు. అటవీశాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో దర్భ చాప, 225 మీటర్ల పొడవు తాడు సిద్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారి శ్రీ రమణారెడ్డి, శ్రీ శ్రీనివాసులు, శ్రీ రామకోటి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.