CULTURAL PROGRAMS IMPRESS DEVOTEES _ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తి భావాన్ని పంచిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు
TIRUMALA, 11 OCTOBER 2024 : The series of cultural programs at Nada Neerajanam and Astana Mandapam organized by TTD won the hearts of the devotees.
Mangala Dhwani, Vedam Purusharthamulu discourse, Bhakti Sangeet by Sri Mohana Krishna and the team were adorable.
While the Harikatha Ganam and classical dances provided a cultural feast to the devotees.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తి భావాన్ని పంచిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు
తిరుమల, 2024 అక్టోబరు 11 ; శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం తిరుమలలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తి భావాన్ని పంచాయి.
నాదనీరాజనం వేదికపై ఉదయం 4:30 నుండి 5:30 గంటల వరకు శ్రీ వేణుగోపాల్ బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు హైదరాబాదుకు చెందిన ఆచార్య రంగ రామానుజాచార్యులు ‘ వేదం- పురుషోర్ధాలు’ అనే అంశంపై ఉపన్యసించారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన శ్రీ మోహన్ కృష్ణ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి కామాక్షి బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి శైలజ బృందం భక్తి సంగీతం నిర్వహించారు. సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఢిల్లీ కుమార్, శ్రీమతి మంజుల బృందం అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. అనంతరం సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ శ్రీనివాస రావు బృందం హరికథ గానం చేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.