DEVOTIONAL PROGRAMS ATTRACTS _ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అలరించిన భక్తి సంగీత కార్యక్రమాలు
Tirumala, 11 October 2024: On Thursday, evening during annual Brahmotsavam, the religious and musical programs conducted under the auspices of All Hindu Dharmic Projects of TTD at Nada Neerajanam and Asthana Mandapam in Tirumala entertained the devotees.
Bhagya Suktam religious discourse, Annamacharya Sankeertans by Sri K Ramacharya, Harikatha by Smt Sarada team, Vishnu Sahasranama Parayanam allured the devotees.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అలరించిన భక్తి సంగీత కార్యక్రమాలు
తిరుమల, 2024 అక్టోబరు 10 ; శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం తిరుమలలోని నాద నీరాజనం, ఆస్థాన మండపంలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి.
తిరుమల నాద నీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన శ్రీమతి లక్ష్మీ సువర్ణ, శ్రీ సీ.హెచ్.మల్లేశ్వర రావ్, శ్రీ బి.చంద్ర శేఖర్, శ్రీ బి.అశోక్ బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల బెంగుళూరుకు చెందిన బ్రహ్మశ్రీ హరి సీతారామమూర్తి, శ్రీ సలక్షణ ఘనాపాఠిలు “భాగ్య సూక్తం-సామాజిక సందేశం” అనే అంశంపై ఉపన్యసించారు. తర్వాత సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు హైదరాబాదుకు చెందిన నంది పురస్కార గ్రహీత శ్రీ కె.రామాచార్య బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు.
ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ప్రసన్న లక్ష్మీ బృందం ” విష్ణు సహస్రనామ పారాయణం” ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన శ్రీ ఓ.ఎల్.ఎన్ రెడ్డి బృందం భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ గౌరిపెద్ది శంకర్ భగవాన్ భక్తి సందేశం అనే అంశంపై ఉపన్యసించారు. అనంతరం సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ కె.సుబ్రమణ్యం, శ్రీమతి టి.లీలాకుమారి బృందం అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకుమదనపల్లెకు చెందిన శ్రీమతిఎ.శారద బృందం హరికథ కార్యక్రమం నిర్వహించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.