CONDUCT BRAHMOTSAVAMS IN A STUPENDOUS WAY-ENDO MINISTER _ శ్రీవారి భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేయండి-రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డిశ్రీవారి భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేయండి-
TIRUMALA, 24 SEPTEMBER 2024: The Honourable Endowments Minister Sri Anam Ram Narayana Reddy asked the TTD officials to organise the ensuing annual festival in a stupendous manner providing a memorable feel to the visiting pilgrims.
On Tuesday, the AP Minister reviewed the Brahmotsavam arrangements with the TTD top brass authorities in Tirumala. He instructed all to ensure a hassle-free darshan and Vahana Sevas to the scores of pilgrims expected to throng during the nine-day fest, especially on the day of Garuda Seva.
TTD EO Sri J Syamala Rao briefed the Minister on the various arrangements being made for the big festival including temple rituals, vahana sevas, darshans, prasadams, Annaprasadam, Security, Sanitation, Civil and Electrical works, parking facilities, utilisation of Srivari Sevaks and many more activities.
Additional EO Sri Ch Venkaiah Chowdhary, JEO Sri Veerabrahmam, CVSO Sri Sridhar and other officials were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేయండి
• రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి
తిరుమల, 2024 సెప్టెంబరు 24: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు చక్కటి ఏర్పాటు చేయాలని టీటీడీ అధికారులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి ఆదేశించారు.
తిరుమలలో దేవాదాయ శాఖ మంత్రి బస చేసిన అతిథి గృహంలో ఆయన శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టిటిడి అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఈవో శ్రీ జె. శ్యామల రావు బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్ల గురించి మంత్రివర్యులకు వివరించారు.
ఇందులో భద్రత విషయంలో తిరుమలలో చేపట్టిన భద్రత ఏర్పాట్లు, ముఖ్యంగా గరుడ సేవకు ఆదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఉదయం 8 నుండి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తామని తెలిపారు. ఇంజనీరింగ్, వసతి, కళ్యాణ కట్ట, వైద్య, ఆరోగ్య, రవాణా, హిందూ ధర్మ ప్రచార పరిషత్ తదితర విభాగాలు చేపట్టిన కార్యక్రమాలను మంత్రివర్యులకు వివరించారు.
అదేవిధంగా గరుడ సేవనాడు చేపట్టబోయే ఏర్పాట్లను కూడా వివరించారు.
అనంతరం మంత్రి వర్యులకు ఈవో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సమావేశ అనంతరం మంత్రివర్యులు శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సమావేశంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ శ్రీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.