ENHANCED FACILITIES TO BE PROVIDED ALONG SRIVARI METTU FOOTPATH ROUTE – TTD EO _ శ్రీవారి మెట్టు మార్గంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం – టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు
TIRUPATHI, 06 MAY 2025: TTD Executive Officer Sri J. Syamala Rao stated that improved facilities will be provided along the Srivari footpath routes for the convenience of pilgrims who choose to walk to Tirumala along this pedestrian walkpath for Srivari Darshan.
Responding to the reports of difficulties faced by pilgrims in obtaining tokens along the Srivari Metti footpath route, the EO, accompanied by Additional EO Sri Ch. Venkaiah Chowdary and JEO Sri V. Veerabrahmam, conducted an inspection on Tuesday.
The EO observed that pilgrims are facing challenges in acquiring tokens and that there are allegations of auto drivers not cooperating, misusing TTD-provided facilities for personal gain, and charging exorbitant fares from pilgrims.
He assured that TTD would initiate measures to address these concerns and provide a permanent solution for the benefit of devotees.
He further stated that the current amenities will be reviewed and strengthened, with consideration given to increasing the number of buses from Tirupati to the Srivarimettu footpath entrance and enhancing the number of token issuance counters.
Feedback from devotees will be collected and used to develop robust and pilgrim-friendly facilities.
TTD CE Sri Satyanarayana, SEs Sri Venkateswarlu and Sri Manoharam, and Deputy EO Sri Lokanatham, along with other officials, participated in the inspection.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి మెట్టు మార్గంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం – టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు
తిరుమల, 2025, మే 06: తిరుమల శ్రీవారి దర్శనార్ధం కాలినడకన వచ్చే భక్తులకు శ్రీవారి మెట్టు మార్గంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు తెలిపారు. కాలినడకన వెళ్లే మార్గంలో టోకెన్లు పొందేందుకు భక్తులు అసౌకర్యానికి గురౌతున్నట్లు తెలియడంతో టిటిడి అదనపు శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మంలతో కలిసి ఆయన మంగళవారం తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్లు పొందడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఆటోవాలాల నుండి సరైన సహకారం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలను ఆటోవాలాలు స్వప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు, భక్తుల నుండి విచ్చలవిడిగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు శాశ్వత పరిష్కార మార్గం దిశగా చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.
భక్తులకు టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించుకుని, మరింత మెరుగైన పటిష్టమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తిరుపతి నుండి శ్రీవారి మెట్టు మార్గం వరకు బస్సుల సంఖ్య పెంచడాన్ని మరియు టోకన్ల జారీ కౌంటర్లను పెంచే అంశాలను పరిశీలిస్తామన్నారు. భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి పటిష్ట సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సీఈ శ్రీ సత్యనారాయణ, ఎస్ ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, మనోహరం, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.