STEPS TO IMPROVE QUALITY OF LADDUS – TTD EO _ శ్రీవారి లడ్డు నాణ్యత మరింత పెంచడానికి చర్యలు – టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు
Tirupati,29 June 2024: TTD EO Sri J Syamala Rao on Saturday directed officials to take immediate measures to enhance the taste and quality of Srivari laddus.
Addressing a review meeting with TTD officials and dairy experts at his chambers on Saturday evening in TTD Administrative Building at Tirupati the EO directed the officials to utilise superior quality ghee and that quality testing of ghee should be done on more scientific lines.
He urged the dairy experts to suggest new technologies of testing and also other changes needed in improving the quality of laddus.
Thereafter eminent dairy experts Sri Vijaya Bhaskar Reddy, Sri Surendranath Reddy presented a PPT on ISI mark of ghee used by TTD and the agmark conditions set by the Food Safety Authority of India.
They offered to submit a comprehensive note highlighting the benchmarks for improving the quality of Srivari laddu Prasadam utilizing superior quality ghee.
JEO Smt Gautami, SV Goshala Director Dr Harinatha Reddy, GM of purchases Sri Muralikrishna, SE-2 Sri Jagadeeshwar Reddy and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి లడ్డు నాణ్యత మరింత పెంచడానికి చర్యలు – టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు
శ్రీతిరుపతి, 2024 జూన్ 29: వారి లడ్డు ప్రసాదాలు మరింత రుచిగా, నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో శనివారం ఈవో కార్యాలయంలో టీటీడీ అధికారులు, డైరీ నిపుణులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, మరింత నాణ్యమైన నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన నెయ్యిని ప్రస్తుతం పరీక్షిస్తున్న విధంగా కాకుండా మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా పరీక్షించాలి తదితర అంశాలపై, అందుకు తీసుకోవలసిన మార్పులను తెలియజేయాలని ఆయన నిపుణులను కోరారు.
తరువాత ప్రముఖ
డైరీ నిపుణులు శ్రీ విజయభాస్కర్ రెడ్డి, శ్రీ సురేంద్రనాథ్ లడ్డు నాణ్యత పెంచేందుకు ఎస్ఎస్ఐ నిబంధనల ప్రకారం నాణ్యమైన నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అగ్ మార్క్, టీటీడీ నిబంధనల ప్రకారం నెయ్యి నాణ్యత ఎలా ఉండాలనే విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారు వివరించారు. నాణ్యమైన నెయ్యి యొక్క ప్రామాణిక విలువల గురించి వారు తమ పిపిటిలో తెలిపారు. త్వరలో లడ్డు నాణ్యత మరింత పెంచడానికి అవసరమైన నెయ్యి సమకూర్చుకోవడానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు.
ఈ సమావేశంలో జెఈఓ శ్రీమతి గౌతమి, ఎస్వి గోశాల డైరెక్టర్ శ్రీ హరినాథ్ రెడ్డి, కొనుగోలు జిఎం శ్రీ మురళీకృష్ణ, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.