ADEQUATE GHEE STOCKS AVAILABLE FOR PREPARATION OF SRIVARI LADDU PRASADAM _ శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి నిల్వలకు కొరత లేదు

TTD URGES DEVOTEES NOT TO BELIEVE FALSE PROPAGANDA

Tirumala, 09 March 2026: TTD has clarified that there is no shortage of cow ghee stocks required for the preparation of Srivari Laddu Prasadam. 

TTD stated that certain individuals have recently been spreading false information on social media, claiming that ghee stocks are unavailable and that laddu preparation has been disrupted. TTD urged devotees not to believe such baseless propaganda.

TTD informed that the supply of cow ghee required for the preparation of Srivari Laddu Prasadam is being ensured through a three-tier procurement system. 

Instead of depending on a single supplier, ghee is being procured from three different firms, ensuring that the supply chain remains uninterrupted even if any unforeseen situation arises.

In this context, it is true that a ghee tanker belonging to Indapur Dairy, which was transporting ghee to Tirumala, recently met with an accident near Kondapur in Kadapa district. However, TTD clarified that the accident involving a tanker from one firm has not affected the supply of ghee, as supplies from the other two firms are continuing without interruption.

At present, about seven lakh Srivari Laddu Prasadams are readily available for distribution to devotees. Therefore, both the preparation and distribution of laddu prasadam are continuing smoothly without any disruption.

TTD further stated that considering the expected increase in pilgrim rush during the summer season, all necessary advance arrangements have been made. Regular maintenance of machinery and conveyor belts in the Laddu preparation unit (Potu) is being carried out periodically through the respective agencies to ensure smooth operations.

While the facts remain as stated above, spreading misinformation that TTD has no ghee stocks and that Srivari sevas and laddu preparation are being affected is unfortunate. Such misleading propaganda may hurt the sentiments of devotees.

TTD once again clarified that the preparation and distribution of Srivari Laddu Prasadam are continuing smoothly, and devotees need not have any concerns.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి నిల్వలకు కొరత లేదు

అసత్య ప్రచారాలను నమ్మవద్దు

 భక్తులకు టిటిడి విజ్ఞప్తి

తిరుమల, 2026 మర్చి 09: శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు టిటిడి వద్ద సమృద్ధిగా ఉన్నాయని టిటిడి స్పష్టం చేసింది. ఇటీవల కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో టిటిడి వద్ద నెయ్యి నిల్వలు లేవని, లడ్డూ ప్రసాదాల తయారీలో అంతరాయం ఏర్పడుతోందని అసత్య ప్రచారం చేయడం సరికాదని తెలియజేస్తున్నాం .

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి సరఫరా మూడంచెల కొనుగోలు విధానం ద్వారా జరుగుతోంది. ఒకే సంస్థపై ఆధారపడకుండా మూడు వేర్వేరు సంస్థల ద్వారా నెయ్యి సరఫరా జరుగుతున్నందున ఎలాంటి అనుకోని పరిస్థితులు తలెత్తినా సరఫరాలో అంతరాయం కలగకుండా టిటిడి ముందస్తు చర్యలు తీసుకుంటోంది.

ఈ క్రమంలో ఇందాపూర్ డైరీ నుండి తిరుమలకు వస్తున్న నెయ్యి ట్యాంకర్ ఇటీవల కడప జిల్లా కొండాపూర్ సమీపంలో ప్రమాదానికి గురైన విషయం నిజమే. అయితే ఒక సంస్థకు చెందిన ట్యాంకర్ ప్రమాదానికి గురైనంత మాత్రాన నెయ్యి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగలేదని టిటిడి స్పష్టం చేసింది. మిగిలిన రెండు సంస్థల నుండి నెయ్యి సరఫరా యథావిధిగా కొనసాగుతోంది.

ప్రస్తుతం భక్తులకు పంపిణీ చేయడానికి సుమారు 7 లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. అందువల్ల లడ్డూ ప్రసాదాల తయారీ మరియు పంపిణీ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని వెల్లడించింది.

అదేవిధంగా వేసవి కాలంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు టిటిడి పేర్కొంది. లడ్డూ తయారీకి సంబంధించిన పోటు విభాగంలో యంత్రాల నిర్వహణ, కన్వేయర్ బెల్ట్‌లు వంటి పరికరాల మరమ్మత్తులు సంబంధిత సంస్థల ద్వారా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

వాస్తవాలు ఇలా ఉండగా టిటిడి వద్ద నెయ్యి నిల్వలు లేవని, శ్రీవారి కైంకర్యాలకు మరియు లడ్డూ ప్రసాదాల తయారీకి ఆటంకం కలుగుతోందని అసత్య ప్రచారం చేయడం బాధాకరం. ఇటువంటి తప్పుదోవ పట్టించే ప్రచారాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున ప్రజలు, భక్తులు వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తోంది.

శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లడ్డూ ప్రసాదాల తయారీ మరియు పంపిణీ పూర్తిస్థాయిలో కొనసాగుతోందని టిటిడి మరోసారి స్పష్టం చేసింది.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల విభాగం