STEPS IMPROVED QUALITY AND TASTE OF SRIVARI LADDUS-EO _ శ్రీవారి లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెంపు- టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు
STRINGENT ACTION ON CONTRACTORS FOR SUPPLYING ADULTERATED GHEE
Tirumala, 23 July 2024: The recent measures had yielded results in improving the taste and quality of Srivari Laddus, asserted TTD EO Sri J Syamala Rao.
Addressing a media conference at Goluklam Rest House the EO said the contractors were also warned of stringent action for supplying adulterated and low-quality ghee.
He said presently in Tirumala there is no adulteration testing equipment and it is very much needed.
He indicated the hurdles in systems for processing raw materials and ghee through procurement.
He also said a committee of four dairy experts is also constituted comprising of Dr Surendranath, Dr Vijay Bhaskar Reddy, Dr Swarnalatha and Dr Mahadevan who were requested to submit their report within a week.
The committee will also advise on terms and conditions to be included for procuring quality ghee in the tenders.
The EO said the ghee suppliers were directed to supply only quality ghee to TTD and one of the companies which was found supplying adulterated ghee as found in the NABL test report was issued a showcase notice for blacklisting. Another company has also been identified for supplying poor-quality ghee, he maintained.
He cautioned that if the ghee suppliers did not follow the tender conditions and regulations, TTD will take firm action against them.
CPRO Dr T Ravi was also present.
శ్రీవారి లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెంపు
– నెయ్యి సరఫరాలో నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు
– టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు
తిరుమల, 2024 జూలై 23: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా అందించాలనే లక్ష్యంతో, ఇప్పటికే తీసుకున్న చర్యల వలన లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెరిగిందని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు. అదేవిధంగా తక్కువ నాణ్యత గల నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు.
తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారన్నారు. ప్రస్తుతానికి అడల్ట్రేషన్ టెస్ట్ చేసే పరికరం టీటీడీ వద్ద లేదని, త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముడిసరుకులు, నెయ్యి ప్రొక్యూర్ మెంట్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు.
నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో
ఎన్ డిఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డా.సురేంద్రనాథ్, హైదరాబాద్ కు చెందిన డా.విజయ భాస్కర్ రెడ్డి, ప్రొ.స్వర్ణ లత, బెంగుళూరుకు చెందిన డా.మహదేవన్ ఉన్నారన్నారు. ఈ కమిటీ వారంరోజులలో నివేదిక అందిస్తారని తెలిపారు. క్వాలిటీ నెయ్యి కోసం టెండర్ లో ఎలాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ దిశ నిర్ధేశం చేస్తుందన్నారు. నెయ్యికి సువాసన చాలా అవసరమని, వీటి ద్వారా రేటింగ్ వేయడానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరినట్లు ఆయన చెప్పారు.
ప్రస్తుత సప్లయర్స్ ను పిలిచి క్వాలిటీ నెయ్యి సరపరా చేయాలని సూచించాం, కొన్ని సంస్థలు హై క్వాలిటీ నెయ్యి పంపిస్తున్నారు, మరికొన్ని సంస్థలు నాసిరకం నెయ్యి అందిస్తున్నాయి. ఓ సంస్థ అడల్ట్రేట్ నెయ్యి ఇస్తున్నట్లు, వెటిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్లు ఎన్ఏబిఎల్ టెస్ట్ లో తేలిందన్నారు.
టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్‌కు పంపినట్లు తెలిపారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఐదుగురు సరఫరాదారులలో ఒకరు అందించిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు సరిపోలడం లేదని మరియు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు చెప్పారు.
టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాం, మరో కంపెనీపై చర్యలు తీసుకుంటామన్నారు. రెండు కంపెనీలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ఆయన వివరించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.