శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ తాత్కాలికంగా నిలిపివేత
శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ తాత్కాలికంగా నిలిపివేత
తిరుమల, 2020 జూలై 20: తిరుపతి నగరంలో కంటైన్మెంట్ నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో ఆఫ్ లైన్లో జారీ చేస్తున్న 3 వేల శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జూలై 21వ తేదీ మంగళవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతుంది.
తదుపరి టోకెన్లు జారీచేసే తేదీని తిరిగి తెలియజేయడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని విజ్ఞప్తి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.