ACTION PLAN TO DEVELOP SRIVARI SEVA OVERSEAS TOO – TTD EO _ శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు కార్యాచరణ – టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు
Tirumala, 24 May 2025: TTD EO Sri J. Syamala Rao has prepared an action plan to develop Srivari Seva overseas also as per the instructions of the Honourable Chief Minister of AP, Sri N Chandrababu Naidu.
A virtual meeting was held with NRIs hailing from 14 countries at the EO Chamber of the TTD administration building in Tirupati on Saturday.
Speaking on the occasion, the EO said that Srivari Sevaks from several states across the country from Kashmir to Kanyakumari have been providing excellent services to the devotees voluntarily and soon NRIs who are experts in various fields from all over the world are welcomed to provide similar selfless services to the visiting pilgrims in Tirumala and Tirupati.
He also said today Srivari Sevaks apart from providing services in various departments of TTD at Tirumala and in Tirupati also taking part in various Dharmic activities of TTD, including Srinivasa Kalyanams, Sri Venkateswara Vaibhavotsavams, organized at different parts of the country.
With an aim to extend the quality of Srivari Seva, in the recent times several reforms have been brought while a few others are underway.
TTD is also contemplating the introduction of Professional seva in Srivari Seva in the departments of medicine, IT, engineering, planning, water management, food technology, architecture, town planning, etc.
Even the NRIs are coming forward to offer their expertise in the respective fields on a voluntary basis.
Later the NRIs have shared their ideas to offer their services in TTD.
The NRIs who participated in this meeting expressed their happiness that TTD has come forward to make the services of Srivari Sevaks universal.
Among NRIs who participated virtually Sri Surya Prakash from Germany presented a PowerPoint Presentation of their ideas about commencing Srivari Seva overseas. While other NRIs comprising Doctors, IT professionals, Chartered Accountants, also shared their ideas.
TTD Additional EO Sri Venkaiah Chowdary, CE Sri TV Satyanarayana, FA and CAO Sri Balaji, Sri Sesha Reddy (GM Transport), CMO Smt. Narmada, Chief PRO Dr T Ravi, Tirumala temple DyEO Sri Lokanatham were also present.
శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు కార్యాచరణ – టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు
తిరుమల ,2025, మే 24: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడిలో శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో శనివారం 14 దేశాలకు చెందిన వివిధ రంగాల ఎన్.ఆర్.ఐ నిపులతో వర్చువల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు స్వచ్ఛందంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పలు రాష్ట్రాలనుంచి శ్రీవారి సేవకులు తిరుమలకు వచ్చి చక్కటి సేవలు అందిస్తున్నారని, త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాలలో నిపుణులైన ఎన్.ఆర్.ఐలు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు .టిటిడిలోని వివిధ విభాగాలలో దేశవ్యాప్తంగా శ్రీవారి సేవకులు అందిస్తున్నారని, వారి సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే అమెరికా తదితర దేశాలలో శ్రీనివాస కల్యాణాలు విరివిగా నిర్వహించేందుకు వారు సహకరిస్తున్నారని ,తాజాగా శ్రీవారి సేవలో తీసుకువస్తున్న సంస్కరణల మూలంగా వైద్యం, ఐటీ, ఇంజనీరింగ్, ప్లానింగ్, వాటర్ మేనేజ్మెంట్ , ఫుడ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాలలో సేవలు అందించేందుకు ఎన్.ఆర్.ఐలు ముందుకు వస్తున్నారన్నారు. ఎన్.ఆర్.ఐల నైపుణ్యం ఆధారంగా వారి సేవలను టిటిడిలో అమలు చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు .వైద్య రంగానికి చెందిన వివిధ విభాగాల వైద్యులతో పాటు వివిధ రంగాల నిపుణులు సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని ఈవో తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న NRI లు
టిటిడి శ్రీవారి సేవకుల సేవలను విశ్వవ్యాప్తం చేసేందుకు ముందుకు రావడంపై ఈ అవకాశం తమకు స్వామి. వారు కల్పించిన మహద్భాగ్యం అని హర్షం వ్యక్తం చేశారు.
ఈ వర్చువల్ సమావేశంలో జర్మనీ – శ్రీ సూర్యప్రకాశ్, డా. శివశంకర్, ఐర్లాండ్ – శ్రీ సంతోష్ పల్లె, శ్రీ రమేశ్ గుమ్మడవల్లి, యూకె – శ్రీ లోకనాథం, శ్రీ విజయ్ కుమార్, శ్రీ అరుణ్ ముమ్మలనేని, శ్రీ శివరామ్ రెడ్డి, శ్రీ విజయ్ కుమార్, డా. అనిల్ కుమార్, డా. అనిల్ కుమార్, శ్రీమతి రీతు, నెదర్లాండ్ – శ్రీ శివరామ్, ప్రాన్స్ – శ్రీ కన్నెవిరనె, పోలెండ్ ఐర్లాండ్ నుండి సంతోష్ – శ్రీ చంద్ర అక్కల, స్వీడన్ – శ్రీ రమణకుమార్ రంగా, స్విట్జర్లాండ్ – శ్రీ అమర్ కవి, అమెరికా – శ్రీ రఘువీర్ బండార్, శ్రీ హర్షిత, USA ,శ్రీ అమరనాథ్, డెన్మార్క్ ,- శ్రీ రామ్ దాస్, మారిషష్ , శ్రీలంక – నుండి శ్రీ విక్కీ తురాయ్జా , దుబాయ్ నుండి – శ్రీ విక్రమ్ UK నుండి Dr అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టిటిడి నుండి అడిషనల్ ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి , సీఈ శ్రీ టివి సత్యనారాయణ, ఎప్.ఎ అండ్ సీఏవో శ్రీ ఓ. బాలాజీ, శ్రీ శేషా రెడ్డి, ట్రాన్స్ పోర్ట్ జీఎం, సీఎంవో శ్రీమతి నర్మద తదితరలు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రధానప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.