శ్రీవేంకటేశ్వర జూనియర్‌ కళాశాలలో అడ్మిషన్లు 

శ్రీవేంకటేశ్వర జూనియర్‌ కళాశాలలో అడ్మిషన్లు

తిరుపతి, జూన్‌-26,  2009: తిరుమల తిరుపతి దేవస్థానములచే  నిర్వహింపబడుచున్న శ్రీవేంకటేశ్వర జూనియర్‌ కళాశాల యందు 2009-10 విద్యాసంవత్సరమునకుగాను 2009 మార్చిలో ఎస్‌.ఎస్‌.సి ఉత్తీర్ణులై దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులకు ఈ క్రింద కనబరచిన తేదీలలో అడ్మిషన్లు జరుగును. ఇంటర్వ్యూ కార్డు అందుకొన్న విద్యార్థులు అన్ని సర్టిఫికెట్లతో కళాశాలలో ఉదయం 8-00 గంటలకు హాజరు కావలయును.

జూన్‌ 29,30 తేదీలలో బాలికలు మరియు లోకల్‌ బాలురకు, జూలై 1వ తేదీన 465 మార్కుల వరకు సాధించిన నాన్‌ లోకల్‌ వారికి, జూలై 2వ తేదీన 464 నుండి 430 మార్కుల వారికి, జూలై 3వ తేదీన 429 నుండి 400 మార్కుల వారికి, జూలై 6వ తేదీన 399 నుండి 375 మార్కుల వారికి,  జూలై 7వ తేదీన 374 నుండి 360 మార్కుల వారికి, జూలై 8వ తేదీన 359 నుండి 340 మార్కుల వారికి, అడ్మిషన్లు కౌన్సిలింగ్‌ నిర్వహింపబడును.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.