BHAGAVAD RAMANUJACHARYA TAUGHT THE PATH OF SALVATION TO THE COMMON MAN _ శ్రీవైష్ణవాన్ని, అష్టాక్షరి మంత్రంలోని అర్ధంతో సామాన్యులకు మోక్ష మార్గాన్ని ఉపదేశించిన గొప్ప తాత్త్వికవేత్త భగవద్ రామానుజాచార్యులు: డా.కె.టి.వి.రాఘవన్
Tirupati, 01 May 2025: Renowned scholar, Dr. K.T.V.Raghavan of Tirupati emphasized that Bhagavad Ramanujacharya stood out as a great philosopher and social reformer in this millennium by teaching the path of salvation to the common man through the meaning of Sri Vaishnava and the Ashtakshari Mantra.
The Avatara Mahotsava of Sri Ramanujacharya entered its second day on Thursday evening at the Annamacharya Kalamandir in Tirupati under the auspices of TTD Alwar Divya Prabandha Project.
On this occasion, Dr. K.T.V.Raghavan, while giving a lecture on the topic “Sri Ramanujacharya – Sri Vaishnavism”, said that Bhagavad Ramanujacharya has introduced Nitya Kainkarya in the Sri Govindaraja Swamy Temple in Tirupati and at Srivari Temple in Tirumala, which has been continuing even today.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవైష్ణవాన్ని, అష్టాక్షరి మంత్రంలోని అర్ధంతో సామాన్యులకు మోక్ష మార్గాన్ని ఉపదేశించిన గొప్ప తాత్త్వికవేత్త భగవద్ రామానుజాచార్యులు: డా.కె.టి.వి.రాఘవన్
తిరుపతి, 2025 మే 01: శ్రీ వైష్ణవాన్ని, అష్టాక్షరి మంత్రంలోని అర్ధన్ని సామాన్యులకు మోక్ష మార్గాన్ని ఉపదేశించి, ఈ సహస్రాబ్దిలోనే గొప్ప తాత్త్వికవేత్తగా, సామాజిక సంస్కర్తగా భగవద్ రామానుజాచార్యులు నిలిచిపోయారని తిరుపతికి చెందిన డా..కె.టి.వి.రాఘవన్ ఉద్ఘాటించారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వార్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం సాయంత్రం శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి.
ఈ పసందర్భంగా డా..కె.టి.వి.రాఘవన్ “శ్రీ రామానుజాచార్యులు – శ్రీ వైష్ణవతత్వం” అనే అంశంపై ఉపన్యసిస్తూ, భగవద్ రామానుజార్యులు సాక్షాత్తు ఆదిశేషుని అంశ అని తెలిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు, దివ్యదేశాలలో ఆయన స్థాపించిన వ్యవస్థ నేటికి కొనసాగుతుందన్నారు.
శ్రీరామానుజాచార్యులను గొప్ప వేదాంతిగా అభివర్ణించారు. భక్తితో కూడిన జ్ఞానం, శరణాగతితో ఈ జన్మలోనే ‘మనుషులకు, పశువులకు, పక్షులకు’ మోక్షం సాధ్యమని ‘శ్రీ వైష్ణవ సాంప్రదాయం’ గ్రంథంలో వుందని చెప్పారు. మనుషులందరూ వేదాధ్యయనానికి అర్హులేనని చాటిన మహనీయుడన్నారు.
అనంతరం ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ వేంకటేశ్వర్లు హరికథా గానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రోగ్రాం అధికారి శ్రీ పురుషోత్తం, ఇతర అదికారులు, విశేష సంఖ్యలో పుర ప్రజలు పాల్గోన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.