DAY 5 OF TEPPOTSAVAM IN SRI GOVINDARAJA SWAMY TEMPLE _ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి దర్శనం
Tirupati, 14 February 2022: On the fifth day of the ongoing Teppotsavams in Sri Govindaraja Swamy temple the processional deities blessed devotees on Tiruchi.
In view of covid guidelines, the annual float festival is being organised inside the temple in Ekantha.
As part of festivities, the utsava idols of Sri Govindaraja Swamy and his consorts were offered Snapana Thirumanjanam.
Special grade DyEO Sri Rajendrudu, AEO Sri Ravi Kumar Reddy were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి దర్శనం
, 2022 ఫిబ్రవరి 14: గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా ఐదో రోజైన సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై దర్శనమిచ్చారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
కాగా చివరి రెండు రోజులు కూడా శ్రీ గోవిందరాజ స్వామి వారిని వేంచేపు చేసి ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటి ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఎపి.శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ వెంకటాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కామరాజు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.