PUSHPAYAGAM PERFORMED IN SKVST _ శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయంలో ఏకాంతంగా పుష్పయాగం
Srinivasa Mangapuram, 20 Mar. 20: The annual Pushpayagam in Sri Kalyana Venkateswara Swamy temple was performed on Friday at Srinivasa Mangapuram.
The celestial pushpayagam event took place in the Kalyana Mandapam of the temple amidst chanting of vedic mantras by priests in the presence of temple authorities.
The processional deities of Sri Kalyana Venkateswara Swamy along with Sridevi and Bhudevi were seated on the special platform and tonnes of varieties of various kinds of traditional, aromatic and ornamental flowers in a befitting manner.
Temple DyEO Sri Yellappa and other officials were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయంలో ఏకాంతంగా పుష్పయాగం
తిరుపతి, 20 మార్చి 2020: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం ఏకాంతంగా జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఆలయంలో ఫిబ్రవరి 14 నుండి 22వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి 4.30 గంటల వరకు పుష్పయాగం నిర్వహించారు. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలు, పత్రాలతో స్వామివారికి అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎల్లప్ప, ప్రధానార్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.