CHAKRA SNANAM HELD IN RANGANAYAKULA MANDAPAM _ శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా చ‌క్ర‌స్నానం

CHAKRA SNANAM HELD IN RANGANAYAKULA MANDAPAM

 Tirumala, 8 February 2022: Due to Covid restrictions the Chakra Snanam was performed in Sri Ranganayakula Mandapam on Tuesday.

A huge vessel Gangalam was set and after performing Snapana Tirumanjanam to Sudarshana Chakrattalwar, immersed in the sacred waters of Gangalam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా  చ‌క్ర‌స్నానం
 
తిరుమల, 2022 ఫిబ్ర‌వ‌రి 08: రథసప్తమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల నడుమ శ్రీ‌వారి ఆల‌యంలో చక్రస్నానం ఏకాంతంగా జరిగింది. ఆ తరువాత వరుసగా కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై శ్రీ మలయప్పస్వామివారు అభయమివ్వ‌నున్నారు.  
 
శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, కొబ్బ‌రినీళ్ళు, తెనె, ప‌సుపు, చందనంల‌తో అర్చకులు అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడయ్యాడు. ఆ త‌రువాత గంగాళంలో చ‌క్ర‌స్నానం నిర్వ‌హించారు.
 
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.