SPIRITUAL BOOKS RELEASED ON UGADI _ శ్రీవారి ఆలయంలో శ్రీ వైఖానస ఆగమశాస్త్ర గ్రంథాలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్
శ్రీవారి ఆలయంలో శ్రీ వైఖానస ఆగమశాస్త్ర గ్రంథాలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్
తిరుమల, 2021 ఏప్రిల్ 13: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉగాది ఆస్థానం అనంతరం రంగనాయకుల మండపంలో ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డితో కలిసి శ్రీ వైఖానస ఆగమశాస్త్రనికి చెందిన 5 గ్రంథాలను ఆవిష్కరించారు.
శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం సహాకారంతో టిటిడి ప్రచురణల విభాగం ముద్రించిన శ్రీ వైఖానస మహిమ మంజరి, ఉత్తమ బ్రహ్మ విద్యాసారః, శ్రీ వైఖానసోపాఖ్యానము, త్రిశతి, ధ్యాన ముక్తావళిః గ్రఃథాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శ్రీ శేఖర్ రెడ్డి, శ్రీ మురళికృష్ణ, శ్రీ చిప్పగిరి ప్రసాద్, డా.నిశ్చిత, జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి , పరిష్కరణ మండలి సభ్యులు శ్రీ వేదాంతం విష్ణుభట్టచార్యులు, శ్రీశ్రీనివాసచార్యులు, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు, ఉపసంపాదకులు డా|| నరసింహాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.