ANJANADRI TIRUMALA – THE BIRTH PLACE OF SRI ANJANEYA – CURTAIN RAISER _ శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థాన అభివృద్ధికి, ఫిబ్రవరి 16న శంఖుస్థాపన మహోత్సవం
TIRUMALA, 14 FEBRUARY 2022: Among the different ranges in Tirumala, Anjanadri is one of the most popular and a forefront synonym of Tirumala Hills.
Skanda, Brahmanda, Brahma, Padma, Bhavishyottara, Vamana, Varaha puranas occupy a prime place in praising Tirumala as Anjanadri as available in the SRI VENKATACHALA MAHATMYAM – an Anthology of Puranas related to Sri Venkatachala as approved by the great Sri Vaishnava Saint Sri Sri Sri Ramanujacharya about one thousand years ago.
To state in particular, Skanda Purana in its all presently available versions, Brahma, Bhamanda Purana, parts of Sri Venkatachala Mahatmyam give a detailed account of ANAJANADRI AS THE BIRTH PLACE OF ANJANEYA.
This kind of Pauranic evidences are not at all available for any other places in India which claim as the Birth Place of Hanuman just basing on the local public notions.
A DIVINE INSPIRATION
It is much known to all that on the 5th August, 2020 the foundation stone for constructing the Divine Temple of Sri Rama in the Holy City of Ayodhya stood as one of the causes for TTD to take up this Anjanadri Tirumala project.
HUMANS PROPOSE GOD DISPOSES
At the same time devotees from different corners of the world have forwarded mails to TTD mandatins to declare Anjanadri as the birthplace of Anjaneya as the famous hillock is located in Tirumala alone.
Consequently, TTD Administration has constituted a Pandita Parishat with Late Prof. V. Muralidhara Sarma, former Vice Chancellor of National Sanskrit University, Tirupati as the President of the scholar committee to thoroughly study the Puranic, Epigraphic, Geological evidences available and establish concrete proofs to declare that Anjanadri Tirumala is Hanuman Janmasthala.
Stalwarts like Prof. Janamaddi Ramakrishna, Prof. Rani Sadasiva Murthy, Dr. Akella Vibhishana Sarma, Prof. Sankara Narayanan, Sri Vijay Kumari Yadav were the other members.
As a result of committed study of various sources by these scholars a synopsis of the future pursuits was brought out and released on the auspicious day of Sri Rama Navami on April 21 in 2021.
A Two Day International Webinar was held with many authentic scholars on July 30 and 31 last. With the best of the contributions by the scholars it was planned to bring out a treatise with authentic citations from the Ramayana and the Mahabharata, the Puranas like Skanda Purana, 11 Pauranic selections from SRI VENKATACHALA MAHATMYAM, main ritualistic Agamas of Tirumala, Other sections of Sanskrit Literature, Bhakti Sahitya on Venkatadri, The Sankeerthanas of Annamayya, Purandara Dasa and Vengamamba, Various Inscriptions etc.
This great book is supplemented by the auspicious blessings of various Pithadhipathis and also of Popular great personalities of the age.
BHOOMI PUJA ON FEBRUARY 16
Finally on February 16, on the auspicious day of Magha Pournami, Bhoomi Puja will be performed at Akasaganga where Anjanadri Anjaneya is located. Donors Sri Narayanam Nageswara Rao and Sri Murali Krishna, renowned Art Director Sri Ananda Sai will give design of the development activities consisting Gopurams, massive statue of Anjaneya etc.
Spiritual personalities including Sri Swarupannda Saraswati of Visakha Sarada Peetham, Chitrakoot Seer, Sri Ramabhadracharyulu, Rama Janmabhoomi Treasurer Sri Govindadev Giriji Maharaj, Sri Koteswara Sarma and others will be gracing the momentous program.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థాన అభివృద్ధికి
ఫిబ్రవరి 16న శంఖుస్థాపన మహోత్సవం
విచ్చేయనున్న ప్రముఖ స్వామీజీలు
తిరుమల, 2022 ఫిబ్రవరి 14: తిరుమలలోని అంజనాద్రిలో శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థాన అభివృద్ధికి మాఘ పౌర్ణమి పర్వదినం నాడైన ఫిబ్రవరి 16న శంఖుస్థాపన మహోత్సవం జరుగనుంది.
తిరుమల ఆకాశగంగ సమీపంలోని అంజనాద్రి శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థలమని భౌగోళిక, పౌరాణిక, శాసన ఆధారాలతో టిటిడి ధర్మకర్తల మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసి, సుందరీకరణ చేపట్టేందుకు శంఖుస్థాపన చేపట్టనున్నారు. ఆకాశగంగ ప్రాంతంలోని అంజనాదేవి, బాల ఆంజనేయస్వామివారి ఆలయం ఎదురుగా ముఖ మండపం, గోపురాలు, ఇతర అభివృద్ధి పనులను దాతలు శ్రీ నారాయణం నాగేశ్వరరావు, శ్రీ కొట్టు మురళీకృష్ణ ఆర్ధిక సహాయంతో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ ఆనంద సాయి ఆధ్వర్యంలో చేపడతారు.
ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థలం అంజనాద్రి – తిరుమల అనే పేరుతో పౌరాణిక – వాఙ్మయ – శాసన – చారిత్రికాధారాలతో సిద్ధం చేసిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందులో హనుమంతుని జన్మవృత్తాంతాన్ని పొందుపరిచారు.
విశాఖ శారద పీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామి, అయోధ్య శ్రీ రామజన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవిందదేవ్ గిరి జీ మహారాజ్, చిత్రకూట్ పీఠాధిపతి శ్రీ రామభద్రాచార్యులు, శ్రీ కోటేశ్వర శర్మ వంటి ఆధ్యాత్మిక ప్రముఖులు ఈ ఉత్సవానికి విచ్చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ కార్యక్రమం ఉదయం 9.30 గంటల నుండి ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
హనుమంతుని జన్మస్థలం నిర్ధారణ క్రమం
– హనుమంతుని జన్మస్థలంగా తిరుమలలోని అంజనాద్రిని గుర్తించాలంటూ పలువురు భక్తులు కొంతకాలంగా లేఖల ద్వారా, ఇ-మెయిళ్ల ద్వారా టిటిడిని కోరడం జరిగింది.
– ఈ మేరకు టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి 2020 డిసెంబరులో పండిత పరిషత్ ఏర్పాటు చేశారు.
– ఈ కమిటీలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, అప్పటి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి కీ.శే. ఆచార్య మురళీధర శర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానుమద్ది రామకృష్ణ, ఆచార్య శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త శ్రీ రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తు శాఖ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ విజయ్‌కుమార్ సభ్యులుగా ఉన్నారు. టిటిడి ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ సమన్వయకర్తగా వ్యవహరించారు.
– ఈ పండిత పరిషత్ పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశోధించి అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని నిర్ధారణ చేసింది.
– జార్ఖండ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర లో ఆంజనేయుని జన్మ స్థలాలుగా అక్కడి వారు నమ్ముతున్న ప్రాంతాలను కూడా పండిత పరిషత్ పరిశీలించింది.
– 2021, ఏప్రిల్ 21న శ్రీరామనవమినాడు పూర్తి ఆధారాలతో హనుమంతుని జన్మస్థలం తిరుమల అని టిటిడి నిరూపించింది. అప్పటి తమిళనాడు గవర్నర్ గౌ. శ్రీ భన్వారిలాల్ పురోహిత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయం ప్రకటించడంతో పాటు బుక్ లెట్ కూడా టిటిడి విడుదల చేసింది.
– అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను టిటిడి ఆహ్వానించడం జరిగింది.
– ఆ తరువాత తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 2021, జూలై 30, 31వ తేదీల్లో టిటిడి అంతర్జాతీయ వెబినార్ నిర్వహించింది.
– శ్రీ కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి, మహీంద్రా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల డీన్ శ్రీ మాడభూషి శ్రీధర్, అప్పటి జాతీయ సంసృత విశ్వవిద్యాలయం ఉప కులపతి, టిటిడి పండిత పరిషత్ అధ్యక్షులు కీ.శే. ఆచార్య వి.మురళీధర్ శర్మ, జీవా డైరెక్టర్ ఆచార్య సముద్రాల రంగ రామానుజాచార్యులు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ కె. మునిరత్నం, ఆచార్య శంకర నారాయణ, ఆర్కియాలజీ అండ్ మ్యూజియం విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జాదవ్ విజయ కుమార్, సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ శ్రీ ఎ. ప్రసన్న కుమార్, విశ్రాంత సంస్కృతోపన్యాసాకులు శ్రీ ఇ. సింగరాచార్యులు, చారిత్రక పరిశోధకులు శ్రీ గోపికృష్ణ వివిధ అంశాలపై మాట్లాడి అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని నిరూపించే ఆధారాలను తెలియజేశారు.
పురాణ ఆధారాలు
అష్టాదశపురాణాల్లోని శ్రీ వేంకటాచలమాహాత్మ్యంలో స్పష్టంగా అంజనాద్రే హనుమ జన్మస్థలంగా ప్రతిపాదించబడింది. కృతయుగంలో వృషాద్రిగా, త్రేతాయుగంలో అంజనాచలంగా, ద్వాపరయుగంలో శేషశైలంగా, కలియుగంలో వేంకటాచలంగా తిరుమల ప్రసిద్ధి పొందిందని వ్యాస భగవానుడు ఉపదేశించాడు. అంజనాదేవి తపస్సు, వాయువు దేవుని కటాక్షంతో హనుమంతుడు జన్మించినట్లు స్కాంద, భవిష్యోత్తర, వరాహ, బ్రహ్మాండపురాణాల్లో వేంకటాచల మాహాత్మ్యఖండాల్లో వివరించబడ్డాయి.
వాఙ్మయ, శాసన ఆధారాలు
వాఙ్మయ, శాసన ఆధారాల ప్రకారం వాల్మీకి రామాయణానికి తమిళ అనువాదమైన కంబ రామాయణం, శ్రీ వేదాంతదేశికులు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు తమ రచనల్లో వేంకటాద్రిగా అంజనాద్రిగా అభివర్ణించారు. స్టాటన్ అనే అధికారి క్రీ.శ. 1800 సంవత్సరంలో తిరుమల గుడి గురించిన విషయాలను సంకలనం చేసి సవాల్-ఏ-జవాబ్ అనే పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో అంజనాద్రి అని పదాన్ని వివరిస్తూ అంజనాదేవికి ఆంజనేయుడు పుట్టిన చోటు కావడం వల్ల అంజనాద్రి అన్నారని రాసినట్లు గుర్తించారు.
వేంకటాచల మాహాత్మ్యం అనే గ్రంథం ప్రమాణమే అని చెప్పటానికి రెండు శిలాశాసనాలు తిరుమల గుడిలో దొరుకుతున్నాయి. ఇందులో మొదటి శాసనం 1491 జూన్ 27వ తేదీకి చెందినది, రెండవ శాసనం 1545 మార్చి 6వ తేదీకి చెందినదిగా గుర్తించారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.