COMPETITIONS ON INTERNATIONAL DAY FOR BIOLOGICAL DIVERSITY AT SPW POLYTECHNIC COLLEGE _ శ్రీ ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంటర్నేషల్ డే ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ పోటీలు
శ్రీ ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంటర్నేషల్ డే ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ పోటీలు
తిరుపతి, 2025, మే 17: ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ – 2025 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు గుంటూరు ఆద్వర్యంలో శనివారం శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల నందు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన డ్రాయింగ్, పెయింటింగ్ , వ్యాసరచన పోటీలకు తిరుపతి జిల్లాలోని పలు జడ్పీ హైస్కూల్, ఎస్పీ డబ్ల్యూ డి ఫార్మశీ విద్యార్థినీలు పాల్గొన్నారు. డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలలో కె. తేజస్విని ప్రథమ స్థానం పొందగా, పి. మాయ ద్వితీయ స్థానం, బి. మహేశ్వరికి, జడ్పీ హైస్కూల్ పుదుపేట కు చెందిన జే.డి. గుణసుందరి మూడో ప్రైజ్ పొందారు. డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలలో రాష్ట్ర స్థాయిలో ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని కె. తేజస్విని ఎంపికైంది. వ్యాసరచన పోటీలలో మొదటి ఫైజ్ జడ్పీ హైస్కూల్ పుదుపేటకు చెందిన ఎస్ జీ లతిక, రెండోవ స్థానం జడ్పీ హైస్కూల్ కరకంబాటికి చెందిన పి. లహరి, మూడో ప్రైజ్ ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన జె. తేజస్విని, బుచ్చినాయుడు కండ్రిగకు చెందిన కె. వర్షిత పొందారు. గెలుపొందిన విద్యార్థినీలకు టిటిడి బోర్డు ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ జె. శ్యామలరావు, డిఈవో శ్రీ వెంకట సునీల్, ప్రిన్సిపాల్ డా. ఎం. పద్మావతమ్మ, రాష్ట్ర సమన్వయ కర్త శ్రీ పి. నీలకంఠయ్య అభినందనలు తెలిపారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.