ANKURARPANAM HELD _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ‌పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ‌పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2024 జూలై 17: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 18 నుండి 20వ తేదీ వరకు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు.

జూలై 18న ప‌విత్ర ప్ర‌తిష్ఠ, జూలై 19న గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, జూలై 20న మ‌హాపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. ‌చివరిరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రహ్మ‌ణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లకు తిరువీధి ఉత్స‌వం నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూప‌రింటెండెంట్ శ్రీ కృష్ణ వర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirupati, 17 July 2024: As a part of annual Pavitrotsavams in Sri Kapileswara Swamy temple, Ankurarpanam fete was observed on Wednesday evening.

The annual Pavitrotsavams will be observed in the famous Shiva temple from July 18 to 20.

On first day Pavitra Pratista, second day Grandhi Samarpana and on the last day Maha Purnahuti will be observed.

Temple officials and devotees were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI