ANKURARPANA HELD FOR KT BTUs _ శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Tirupati, 3 March 2021: The Ankurarpana for Sri Kapileswara Swamy Brahmotsavams held on Wednesday evening.
This religious event took place between 6:30pm and 7:30pm. Earlier Asthanam of Sri Vinayaka Swamy on Mooshika Vahanam held.
On March 4, Dhwajarohanam will take place in the auspicious Meena Lagnam at 7:34am.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2021 మార్చి 03: తిరుపతిలోని శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మార్చి 4 నుండి 13వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్ -19 నేపథ్యంలో వాహనసేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
అంకురార్పణం సందర్భంగా సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారికి ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత సాయంత్ర 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు అంకురార్పణం జరిగింది.
మార్చి 4న ధ్వజారోహణం :
మార్చి 4న గురువారం ఉదయం 7.34 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు పల్లకీ ఉత్సవం, రాత్రి 7 నుంచి రాత్రి 8 గంటల వరకు హంస వాహనం ఆస్థానం జరుగనున్నాయి.
ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 7 నుండి 8 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
04-03-2021(గురువారం) ధ్వజారోహణం(మీనలగ్నం) హంస వాహనం
05-03-2021(శుక్రవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
06-03-2021(శనివారం) భూత వాహనం సింహ వాహనం
07-03-2021(ఆదివారం) మకర వాహనం శేష వాహనం
08-03-2021(సోమవారం) తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం
09-03-2021(మంగళవారం) వ్యాఘ్ర వాహనం గజ వాహనం
10-03-2021(బుధవారం) కల్పవృక్ష వాహనం అశ్వవాహనం
11-03-2021(గురువారం) రథోత్సవం(భోగితేరు) నందివాహనం
12-03-2021(శుక్రవారం) పురుషామృగవాహనం కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం
13-03-2021(శనివారం) శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,
ఆస్థానం, త్రిశూల స్నానం. ధ్వజావరోహణం.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.