CHAIRMAN RELEASES BOOKLET ON SRI KT BTU _ శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్
Tirupati, 24 February 2024: TTD Chairman Sri Bhumana Karunakara Reddy on Saturday released the booklet on the annual Brahmotsavam of Sri Kapileswara temple slated from March 1 -10 with Ankurarpanam on February 29 evening.
The program was held at Sri Padmavati Rest House in the presence of Temple DyEO Sri Devendra Babu and other officials of the temple.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్
తిరుపతి, 24 ఫిబ్రవరి 2024: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 1 నుండి 10వ తేదీ వరకు జరుగనున్నవార్షిక బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి ఆవిష్కరించారు. తిరుపతిలోని పద్మావతి పురంలోని ఛైర్మన్ నివాసంలో శనివారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది.
ఫిబ్రవరి 29వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
01-03-2024
ఉదయం – ధ్వజారోహణం(మీనలగ్నం)
రాత్రి – హంస వాహనం
02-03-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
03-03-2024
ఉదయం – భూత వాహనం
రాత్రి – సింహ వాహనం
04-03-2024 ఉదయం – మకర వాహనం
రాత్రి – శేష వాహనం
05-03-2024
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
రాత్రి – అధికారనంది వాహనం
06-03-2024
ఉదయం – వ్యాఘ్ర వాహనం
రాత్రి – గజ వాహనం
07-03-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – అశ్వ వాహనం
08-03-2024
ఉదయం – రథోత్సవం (భోగితేరు)
రాత్రి – నందివాహనం
09-03-2024
ఉదయం – పురుషామృగవాహనం కల్యాణోత్సవం,
రాత్రి – తిరుచ్చి ఉత్సవం
10-03-2024
ఉదయం – త్రిశూలస్నానం ధ్వజావరోహణం,
రాత్రి – రావణాసుర వాహనం
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.