RELIGIOUS BOOKS RELEASED _ శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలపై పుస్తకాన్ని ఆవిష్కరించిన టిటిడి జేఈవో

Tirupati, 22 February 2025: TTD JEO Sri Veerabrahmam released a book on Sri Kapileswara Swamy.

In the context of the ongoing annual Brahmotsavam at Kapilatheertham, Dr A Vibhishana Sharma penned a book on Vahana Vaibhavam. 

Along with that, various Brahmotsava special pujas are also included.

The book was launched in the conference hall of the TTD administration building on Saturday.

CE Sri Satyanarayana, HDPP Secretary Sri Sriram Raghunath and other officials participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలపై పుస్తకాన్ని ఆవిష్కరించిన టిటిడి జేఈవో

తిరుపతి, 2025, ఫిబ్రవరి 22: శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డా. ఆకెళ్ల విభీషణ శర్మ రచించిన శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనే పుస్తకాన్ని శనివారం టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం ఆవిష్కరించారు. టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ పుస్తకంలో బ్రహ్మోత్సవాలలోని వాహన సేవల విశిష్టతను వివరించారు. వాహన సేవలతోపాటు ఆలయంలో జరిగే వివిధ బ్రహ్మోత్సవ విశేష పూజలను అందులో పొందుపరిచారు.

ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ సత్యనారాయణ, డిపిపి కార్యదర్శి శ్రీ శ్రీరామ్ రఘనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.