DONATION OF SILVER ORNAMENTS TO SRI KT _ శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రీకామాక్షి అమ్మవారికి వెండి ఆభరణాలు విరాళం
Tirupati, 12 February 2025: Silver ornaments were donated to Sri Kapileswara Swamy temple on Wednesday.
Totalling around 9kg 115 grams the silver ornaments were donated to Sri Kamakshi Ammavaru of Sri Kapileswara Swamy Temple by the devotee Sri SV Narahari of Tirumala along with his family on Wednesday.
TTD JEO Sri Veerabrahmam received the ornaments at the Unjal Mandapam.
A total of 12 types of ornaments worth approximately Rs.9.28 lakhs were donated.
The silver ornaments given by the donor includes Crown – 1, Ears – 2, Hands – 4, Feet – 2, Peetham – 2, Saree – 1 for Goddess. After that, the priests performed a special pooja for the jewels.
Temple Deputy EO Sri Devendra Babu, AEO Sri K. Subbaraju, Superintendent Sri. K.P. Chandrasekhar, DE Sri. Mallaiah, Temple Inspector Sri A. Ravikumar and other officers participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రీకామాక్షి అమ్మవారికి వెండి ఆభరణాలు విరాళం
తిరుపతి, 2025, పిబ్రవరి 12: కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలోని శ్రీకామాక్షి అమ్మవారికి 9 కేజీల 115 గ్రాముల వెండి ఆభరణాలను తిరుమల వాస్తవ్యులు శ్రీ ఎస్వీ నరహరి దంపతులు బుధవారం విరాళంగా అందించారు. సుమారు రూ.9.28 లక్షలు విలువ చేసే 12 రకాల ఆభరణాలను కపిలతీర్థం ఆలయంలోని ఊంజల్ మండపం వద్ద టిటిడి తిరుపతి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మంకు దాత అందజేశారు.
దాత అందించిన వెండి ఆభరణాలలో అమ్మవారికి కిరీటం – 1, చెవులు – 2, చేతులు – 4, పాదాలు – 2, పీఠం – 2, అమ్మవారికి చీర – 1 ఉన్నాయి. అనంతరం ఆభరణాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దాత శ్రీ ఎస్వీ నరహరి దంపతులను టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం శాలువతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందించారు.
ఈ కార్యక్రమంలో దాత కుటుంబసభ్యులు, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో శ్రీ కె. సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ కె.పి.చంద్రశేఖర్, డిఈ శ్రీ మల్లయ్య, టెంపుల్ ఇస్పెక్టర్ ఎ. రవికుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.