CHANDI YAGAM BEGINS _ శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా చండీయాగం ప్రారంభం
Tirupati, 5 Nov. 19: Chandi yagam commenced in Sri Kapileswara Swamy temple on Tuesday as a part of the ongoing month long Karthika Homa Mahotsavams.
The Homam was performed in Yagashala in a ceremonious manner amidst the chanting of vedic mantras by temple priests.
The homam will be observed for the next nine days till November 13.
Temple DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా చండీయాగం ప్రారంభం
తిరుపతి, 2019 నవంబరు 05: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా తొమ్మిది రోజుల పాటు చండీయాగం వైభవంగా జరుగనుంది.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, నిత్యహోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహిస్తారు.
కాగా, గృహస్తులు రూ.500/- టికెట్‌తో ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.