HOMA MAHOTSAVAMS CONCLUDES _ శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా ముగిసిన హోమ మహోత్సవాలు

TIRUPATI, 01 DECEMBER 2024: The month-long Homa Mahotsavams concluded on a grand religious note in Sri Kapileswara Swamy temple on Sunday.

After Chandikeswara Homam in the morning Kalasa Udwasana, Trisula Snanam were performed.

In the evening Laksha Deeparadhana, Tiruveedhi utsavam of 

Panchamurthies were performed.

DyEO Sri Devendra Babu and others, devotees were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా ముగిసిన హోమ మహోత్సవాలు

తిరుప‌తి, 2024 డిసెంబ‌రు 01: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించిన హోమ మహోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి.

ఉదయం శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరిగింది. అనంతరం మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మ‌హాశాంతి అభిషేకం, కలశాభిషేకం, త్రిశూల‌స్నానం, అంకుర‌ విసర్జన నిర్వహించారు.

సాయంత్రం లక్షదీపారాధన, పంచమూర్తులైన శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీచండికేశ్వరస్వామి వారికి ఆరాధన చేపట్టారు. ఆ త‌రువాత పంచమూర్తులు పుర‌వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య‌ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.