NAVAHNIKA CHANDI HOMAM COMMENCES AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా ఛండీ హోమం ప్రారంభం

Tirupati, 30 October  2025: The nine day Chandi Homam commenced in a grand manner on Thursday at Sri Kapileswara Swamy Temple in Tirupati as a part of the month-long Karthika Masotsavams. 

The Chandi Homam will be observed from October 30 to November 7.

The event was attended by TTD Deputy Executive Officer Smt. Nagaratna, Superintendent Sri Chandrasekhar, temple priests, other officials, and a large number of devotees.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా ఛండీ హోమం ప్రారంభం

తిరుపతి, 2025, అక్టోబర్ 30: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఛండీ హోమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అక్టోబరు 30 నుండి నవంబరు 07వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం) వైభవంగా జరుగనుంది.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పూజ, హోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.

కాగా, గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్ ,  ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.