CHANDI YAGAM PERFORMED _ శ్రీ కపిలేశ్వరాలయంలో చండీయాగం ప్రారంభం

Tirupati, 24 Nov. 20: As part of Karthika Masa Homa Mahotsavams, Chandi Yagam was performed in Sri Kapileswara Swamy temple in Tirupati on Tuesday.

Chandi Homam, Chandi Parayanam and Visesha Deeparadhana were organised.

Dy. EO Sri Subramanyam, Superintendent Sri Bhupati and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ కపిలేశ్వరాలయంలో చండీయాగం  ప్రారంభం

తిరుపతి, 2020 న‌వంబ‌రు 24: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో  శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం) మంగ‌ళ‌వారం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా ప్ర‌త్యేక కార్య‌మాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే. ఇందులో భాగంగా తొమ్మిది రోజుల పాటు చండీయాగం జరుగనుంది.
 
ఆల‌య ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉదయం పూజ, నిత్య‌హోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వ‌హిస్తారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.