PAVITROTSAVAMS COMMENCE AT SKT _ శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
Tirupati, 2 Jul. 20: The three day annual Pavitrotsavams at Sri Kapileswara Swamy temple commenced on Thursday in Ekantham in view of COVID-19 restrictions.
The rituals as per Saiva Agama traditions are performed to keep up the divinity of temple and ward off the wrong effects of lapses if any that happened during the festivals and Archanas through out the year in the temple.
As a part of the same Snapana Tirumanjanam is performed to the Pancha utsava idols of Sri Kapileswara, Sri Kamakshi Ammavaru, Sri Vighneswara, Sri Subramanya Swami and Sri Chandikeswara Swamy. Later in the evening Kalasa pujas, Homa and Pavitra Pratista are conducted.
Temple DyEO Sri Subramaniam, Superintendent Sri Bhupathi, Temple inspector Sri Srinivas Nayak and others participated.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2020 జూలై 02: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహించారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, పసుపు, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో స్నపనతిరుమంజనం చేపట్టారు. సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖర్, శ్రీ శ్రీనివాస నాయక్ తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.