PAVITROTSAVAMS COMMENCES IN KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
TIRUPATI, 21 JULY 2021: The annual Pavitrotsavams commenced on a religious note in Sri Kapileswara Swamy temple in Tirupati on Wednesday.
Earlier during the day, the Panchamurthies of Sri Kapileswara Swamy, Sri Kamakshidevi, Sri Vighneswara Swamy, Sri Subramanya Swamy and Sri Chandikeswara Swamy were rendered celestial Snapana Tirumanjanam.
Later in the evening, Kalasa Puja, Homam and Pavitra Pratista will be performed as per Saivagama. Due to Covid 19 restrictions, all these rituals are being observed in Ekantam.
Temple DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2021 జూలై 21: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం 9 నుండి 10 గంటల వరకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, పసుపు, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో స్నపనతిరుమంజనం చేపట్టారు. సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖర్, శ్రీ శ్రీనివాస నాయక్ తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.